మైసూర్ జూ పార్క్‌లో ఉన్న జంతువులు ఇక మీ మొబైల్‌లో....

Posted By: Staff

మైసూర్ జూ పార్క్‌లో ఉన్న జంతువులు ఇక మీ మొబైల్‌లో....

మైసూరు: చింపాజీలు కర్ర పట్టుకోని చెదలు వదలకొట్టడంలో మనుషుల కంటే చాలా తెలివైనవి. మనుషులతో పోల్చుకుంటే జిరాఫీ కాళ్శు ఆరు అడుగులు ఎత్తు పోడవుగా ఉంటాయి. ఇలాంటివి అన్ని వింటుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక మీదట మైసూర్ జూ పార్క్‌ని మీరు సందర్శించినప్పుడు సెల్‌ఫోన్ ఆడియో గైడ్ ద్వారా ఇలాంటివి ముందే తెలుసుకోవచ్చు. జూ పార్కులో ఉన్నటువంటి అన్ని జంతువుల గురించిన సమాచారం ఆడియో గైడ్ ద్వారా మనకు తెలియజేస్తారు.

ఇలాగ ఇండియా జూ పార్కులోనే మొట్టమొదటసారిగా మైసూర్ జూ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. జూ పార్కు అధారిటీస్ చెప్పిన ప్రకారం ఆడియో గైడ్ ఫెసిలిటీ ఇంగ్లీషు, కన్నడలో లభిస్తుందని అన్నారు. ఈ సందర్బంలో జూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫారెస్ట్ పరిరక్షకుడు అయిన కెబి మార్కాండేయ మాట్లాడుతూ జంతువుల గురించిన సమాచారం టూరిస్ట్‌లకు ఈజీగా అర్దమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధానాన్ని రూపోందించడం జరిగిందని తెలిపారు. మీరు గనుక జూ పార్క్ ఆడియా గైడ్‌లో ఒక్క బటన్‌ని టచ్ చేస్తే చాలు మీకు కావాల్సినటువంటి అన్ని జంతువుల గురించిన సమాచారం చక్కగా వివరిస్తుంది.

సింపుల్‌గా వాడడానికి ఈ ఆడియో గైడ్ జూ పార్కు టిక్కెట్ కౌంటర్స్‌లలో కేవలం 10 రూపాయల నుండే లభిస్తుందని అన్నారు. పది రూపాయలు చెల్లిస్తే మీకు స్కాచ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాచ్ కార్డుని మీరు యాక్టివేట్ చేసుకుంటే జూ పార్క్‌లో ఉన్నటువంటి జంతువుల సమాచారం మీ సెల్ ఫోన్‌లో ఆడియో గైడ్ రూపంలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్కాచ్ కార్డు మీద ఉన్న కోడ్‌ని మీ సెల్‌ఫోన్‌లో ఎంటర్ చేయగానే ఆడియో గైడ్ సర్వీస్ ప్రారంభం అవుతుంది.

చివరగా మార్కండేయ మాట్లాడుతూ ఈ ఫెసిలిటీని టూరిస్ట్‌ల కోసం పోయిన వారమే లాంఛ్ చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ఇది బాగా పాపులర్ అవుతుందని భావిస్తున్నాం...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot