ఇక టికెట్ చేతికొచ్చాకే డబ్బులు కట్టండి.

తత్కాల్ కోటా క్రింద బుక్ చేసుకునే ట్రెయిన్ టికెట్స్ పై సరకొత్త వెసలుబాటను ఆండురిల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ కల్పిస్తోంది. ఈ సంస్థ IRCTC కోసం 'పే ఆన్ డెలివరీ' పేరుతో సరికొత్త పేమెంట్ సొల్యూషన్‌ను అభివృద్ధి చేసింది. ఈ-కామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉండే క్యాష్ ఆన్ డెలివరీ స్కీమ్ మాదిరిగానే Pay On Delivery స్కీమ్ లో కూడా డెలివరీ ఆఫ్టర్ పేమెంట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Read More : రూ.74తో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 5జీబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేరుగా వారి అడ్రస్‌కే..

ఉంటుంది. పే ఆన్ డెలవరీ ఆప్షన్‌తో ఐఆర్‌సీటీసీ యూజర్లు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే నేరుగా వారి అడ్రస్‌కే టికెట్లను డెలివరీ చేయటం జరుగుతుంది. టికెట్స్ డెలివరీ అయిన తరువాతనే నగదును చెల్లించే వీలుంటుంది. ఈ నగదును క్యాష్ రూపంలో లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ద్వారా చెల్లించవచ్చు. ఇప్పటి వరకు పే ఆన్ డెలివరీ సర్వీస్ జనరల్ రిజర్వేషన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకనుంచి తత్కాల్ టికెట్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది.

Pay On Delivery సర్వీసును ఉపయోగించకోవటం ఎలా..?

ముందుగా IRCTC యూజర్లు irctc.payondelivery.co.inలో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా పాన్ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. IRCTC వెబ్ సైట్ లో టికెట్ లను బుక్ చేసుకునేటపుడు ‘pay-on-delivery' ఆప్షన్ ను యూజర్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. టికెట్ డెలివరీ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా జరుగుతంది. డెలివరీ పూర్తియిన 24 గంటల్లోపు పేమెంట్ చేయవల్సి ఉంటుందని ఆండురిల్ టెక్నాలజీస్ తెలిపింది.

IRCTC Rail Connect యాప్‌

ఇంటర్నెట్ మనందరి జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఉదయం నిద్ర‌లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఇంటర్నెట్‌తో అనేక అవసరాలు ముడిపడి ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్ ద్వారానే ప్రజలకు చేరువకావాలని చూస్తున్నాయి. తాజాగా, ఇండియన్ రైల్వేస్ IRCTC Rail Connect యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ మరింత సులభతరంగా మారిపోయింది.

Android, iOS అలానే Windows

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌ను Android, iOS అలానే Windows స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇండియన్ రైల్వేస్ అందుబాటులో ఉంచింది. ఆయా యాప్ స్టోర్‌లలోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అనేక సదుపాయాలు..

న్యూ అకౌంట్ రిజిస్ట్రేషన్, అడ్వాన్సుడ్ సెక్యూరిటీ, లేడీస్ బుకింగ్, తత్కాల్ బుకింగ్, ప్రీమియమ్-తత్కాల్ కోటా బుకింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్, సింకింగ్ ఆఫ్ ఐఆర్‌సీటీ ఎన్‌జీఈటి వెబ్‌సైట్, ఎన్‌జీఈటి మొబైల్ యాప్ టికెట్స్, ఇ-టికెట్స్ స్టేటస్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ యాప్‌లో ఉన్నాయి.

క్లీన్‌ యూజర్ ఇంటర్‌ఫేస్

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌కు సంబంధించిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత క్లీన్‌గా డీసెంట్ లుక్‌ను కలిగి ఉంటుంది. అంతరాయంలేని పనితీరును ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆఫర్ చేస్తుంది. టికెట్లను సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీరు చెల్లించే ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా మరింత సెక్యూర్‌గా ఉంటాయి.

టికెట్ బుకింగ్ మాత్రమే కాదు..

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌ ద్వారా ఒక్క టికెట్ బుకింగ్ మాత్రమే కాదు క్విక్ రీఫండ్ ఆప్షన్ ద్వారా వాటిని క్యాన్సిల్ కూడా చేసేయవచ్చు. గతంలో బుక్ చేసిన టికెట్లకు సంబంధించిన హిస్టరీని కూడా తెలుసుకునే వీలుంటుంది.

మీల్స్ బుకింగ్, టీడీఆర్ ఫైలింగ్

ప్రయాణ సమయంలో మీల్స్ బుకింగ్, సెక్యూర్ పేమెంట్స్, టీడీఆర్ ఫైలింగ్ వంటి ప్రత్యేకమైన ఆప్షన్స్ కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. విమాన టికెట్లను కూడా ఈ యాప్ సహాయంతో బుక్ చేసుకోవచ్చు.

పేమెంట్ పూర్తి అయిన తరువాత

పేమెంట్ పూర్తి అయిన తరువాత టికెట్‌ను మీ మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు. టికెట్‌ను సేవ్ చేసుకుని తరువాత ప్రింట్ తీసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తోంది. యాప్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటే అవసరం‌లేని బుకింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now, Pay on Delivery for Tatkal Tickets on IRCTC. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting