ఫోన్ చేస్తే చాలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తారు

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డబ్బును సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు సరికొత్త టోల్ ఫ్రీ నెంబర్‌ను కాన్సెప్ట్‌ను Paytm బుధవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేయటం ద్వారా పేటీఎమ్ ఖాతాదారులు అలానే మర్చెంట్స్ ఇంటర్నెట్ కనెక్షన్'తో పనిలేకుండా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

Read More : సంచలనం రేపిన నోకియా ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్యాష్‌లెస్ లావాదేవీలను పెంచే క్రమంలో...

క్యాష్‌లెస్ లావాదేవీలను మరింత పెంచే క్రమంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేటీఎమ్ చెబుతోంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయగించుకోవటం ద్వారా యాప్‌లోకి వెళ్లకుండానే నగదు చెల్లింపులను చేపట్టవచ్చు.

4 డిజిట్ల Paytm PINతో..

ఈ సర్వీసుకు సంబంధించిన బెనిఫిట్లను పొందే క్రమంలో యూజర్లు ముందుగా తమ మొబైల్ నెంబర్లతో పాటు 4 డిజిట్ల Paytm PINతో పేటీఎమ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేసి మీరు నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్ అలానే అతని Paytm PIN వివరాలను తెలపటం ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేసే వీలుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాలెట్ ద్వారా ట్రాన్స్‌ఫర్

ఈ ప్రక్రియలో భాగంగా సెండర్‌కు సంబంధించి పేటీఎమ్ వాలెట్‌లోని నగదును రిసిప్టెంట్ పేటీఎమ్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం జరుగుతుంది

నోట్లను రద్దు నేపథ్యంలో..

నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో Paytm యాప్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. నిన్నమొన్నటి వరకు ఈ యాప్‌ను చాలా మంది యూజర్లు మొబైల్ రీఛార్జ్ నిమిత్తం ఉపయోగించుకునే వారు.

అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు..

తాజాగా పరిస్థితుల నేపథ్యంలో Paytm యా‌ప్‌ను అనేక రకాలుగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. పేటీఎమ్ యాప్‌ను మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయటం ద్వారా చేకూరే 5 ప్రయోజనాలు...

క్యాష్‌బ్యాక్స్ దగ్గర నుంచి..

పేటీఎమ్ వాలెట్ అనేక ఆసక్తికర ఆఫర్లను తమ యూజర్లకు చేరువచేస్తోంది. క్యాష్‌బ్యాక్ కూపన్స్ , డిస్కౌంట్స్ ఇలా అనేక రూపాల్లో ప్రతి లావాదేవీ పై పేటీఎమ్ ఆఫర్ల మోత మోగిస్తోంది.

రైల్వే టికెట్ బుకింగ్ సదుపాయం కూడా..

పేటీఎమ్ యాప్ ద్వారా సినిమా టికెట్ల దగ్గర నుంచి రైల్వే టికెట్స్ వరకు, ఫుడ్ దగ్గర నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ లావాదేవీ ఫెయిల్ అయినట్లయితే Paytm wallet తక్షణమే నగదును రీఫంట్ చేసేస్తుంది. మిగిలిన యాప్స్‌లో ఇటువంటి సదుపాయం లేదు.

New Nearby పేరుతో..

New Nearby పేరుతో సరికొత్త ఫీచర్‌ను Paytm ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమీపీంలో Paytm చెల్లింపులను అంగీకరించే వ్యాపార కేంద్రాలను గుర్తించవచ్చు.

రీఛార్జ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు

రీఛార్జ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా అనేక సర్వీసులను Paytm ఆఫర్ చేస్తోంది. అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు Paytm యాప్‌ను పర్‌ఫెక్ట్ షాపింగ్ గేట్ వేగా అభివర్ణిస్తున్నారు. రీఛార్జ్ పేమెంట్ దగ్గర నుంచి షాపింగ్ లావాదేవీల వరకు పేటీఎమ్ యాప్ ద్వారా జరిపే ఎటువంటి transactions అయినా కేవలం 30 సెకన్లలో విజయవంతం కాబడతాయి. స్మార్ట్‌ఫోన్‌ను కలిగిఉన్న ప్రతి ఒక్కరు Paytm సర్వీసులను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now pay and receive money via Paytm without an internet connection. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot