IRCTC కొత్త టెక్నాలజీ, ఇకపై వెయిటింగ్ లిస్ట్‌కి సెలవు

నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే.

|

నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ ప్రయాణికులను కలవర పెడుతుంది. అయితే, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆన్ లైన్ రైల్వే టికెటింగ్ సేవల సంస్థ ఐఆర్సీటీసీ, ఇకపై బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతుంటుంది.ఇప్పటివరకు కొన్ని ప్రవేట్ సంస్థలు మాత్రమే విశ్లేషించి సమాచారం ఇస్తుండగా.. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనూ ఈ సౌకర్యం లభిస్తోంది.

టెక్నాలజీకి దూరంగా టెక్నాలజీకి దూరంగా "టెక్ గురు"ల పిల్లలు,మరి బానిసైన వారి పరిస్థితేంటి?

13 ఏళ్ల సమాచారం సేకరించి..

13 ఏళ్ల సమాచారం సేకరించి..

టికెట్ల బుకింగ్, రద్దుకు సంబంధించి 13 ఏళ్ల సమాచారం సేకరించి, వాటి ఆధారంగా బెర్త్ ఖరారయ్యే అవకాశాన్ని నిర్ణయించేలా టెక్నాలజీని రూపొందించింది. ఈ వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్‌ఐఎస్) అభివృద్ధి చేసింది.

వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ ప్రయాణికులకు..

వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ ప్రయాణికులకు..

గతంలో వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ ప్రయాణికులకు చివరి నిమిషం వరకూ బెర్త్ కన్ఫర్మేషన్‌పై గందరగోళం ఉండేది. ప్రస్తుతం ప్రతి రోజు బుకింగ్ తీరును బట్టి బెర్త్ దొరుకుతుందా? లేదా? అని విషయం వెంటనే తెలిసిపోతుంది.

13 లక్షల టికెట్లు

13 లక్షల టికెట్లు

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్‌ అవుతున్నాయి. తనకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయన్న విషయాన్ని, పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా వెబ్ సైట్ వెల్లడిస్తుంది.

రైళ్ల ఆలస్యానికి గల కారణాలను

రైళ్ల ఆలస్యానికి గల కారణాలను

దీంతో పాటు రైళ్ల ఆలస్యానికి గల కారణాలను అన్ని రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫాం తెరలపై వీడియో రూపంలో ప్రదర్శించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై రైలు ఆలస్యానికి గల కారణాలను వీడియోలో వివరిస్తారు.

30శాతం రైళ్లు

30శాతం రైళ్లు

ప్రస్తుతం దేశంలో 30శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఇకపై రైలు ఆలస్యానికి రైల్వే శాఖ వీడియోల ద్వారా ప్రయాణికులకు క్షమాపణ చెప్పనున్నారు.

Best Mobiles in India

English summary
Now, railways to tell you if your ticket stands a chance of being confirmed More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X