Home
News

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..అయితే మీ కోసం అధ్బుతమైన ఫీచర్ రెడీ..

గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకి గూగుల్ ఓ శుభవార్తను అందించింది.

By Hazarath

గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకి గూగుల్ ఓ శుభవార్తను అందించింది.ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నప్పుడు వచ్చే నోటిఫికేషన్లకు ఇక మీదట అక్కడి నుంచే నేరుగా రిప్లై ఇచ్చే అవకాశాన్ని గూగుల్‌ క్రోమ్‌ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ క్రోమ్‌లో లేని విషయం తెలిసిందే.

chrome

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే పాప్‌ అప్‌ మెనూ పై వచ్చిన నోటిఫికేషన్లకు నేరుగా అక్కడి నుంచే బదులివ్వొచ్చు. కాగా ఒక క్లిక్‌తో సబ్‌మిట్‌ చేసే సదుపాయం ఈ ఫీచర్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదని గూగుల్‌ తెలిపింది. గతంలో ఉన్న 'గోబ్యాక్‌ విత్‌ బ్యాక్‌స్పేస్‌' ఆప్షన్‌ను గూగుల్‌ క్రోమ్‌ కొనసాగింపులో భాగంగా తిరిగి ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్‌ ద్వారా డీఫాల్ట్‌గా తీసివేసిన దాన్ని ఈ బ్రౌజర్‌ ద్వారా పొందే వీలుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో అందుబాటులో ఉంది. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం.

క్రోమ్ వేగంపెరగాలంటే కింది సూచనలు పాటించండి..

టిప్ 1

టిప్ 1

అనవసరమైన ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఇంచుమించుగా ఎక్స్‌టెన్షన్స్ మాదిరగానే ఉంటాయి. ఇవి మీ బ్రౌజర్‌ పనితీరును అదనంగా పెంచటంలో తోడ్పడతాయి. అయితే అవసరం లేని ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయాలంటే..? 

ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://plugins"అని టైప్ చేయండి. - ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన ప్లగిన్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న plugins పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

టిప్ 2

టిప్ 2

అవసరం లేని ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయాలంటే..?  ముందు క్రోమ్ లొకేషన్ బార్ లో chrome://extensionsఅని టైప్ చేయండి. - ఇప్పుడు మీరు క్రోమ్ Options > More tools > Extensionsలోకి వెళతారు - ఇక్కడ మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న ఎక్స్‌టెన్షన్‌ల పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

టిప్ 3

టిప్ 3

పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసిన HTML5, CSS, JavaScript యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

టిప్ 4

టిప్ 4

Enable Prefetch Resources ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకున్నట్లయితే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేకమైన ఇంటెలిజెంట్ ఫీచర్లతో వస్తోంది. వీటిలో నెట్‌వర్క్ ప్రెడిక్షన్, స్పెల్లింగ్ కరెక్షన్, రిసోర్స్ ప్రీలోడర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ రిసోర్స్ ప్రీ-ఫెట్చర్ ఫీచర్లు మీ ఓపెన్ చేసే వెబ్ పేజ్ లేదా లింక్స్‌కు సంబందించి తెలివైన సలహాలను అందిస్తాయి. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ బ్రౌజర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకోవాలంటే..? క్రోమ్ ఆప్షన్స్ లోని Settings > Show advanced settingsలోకి వెళ్లండి "Prefetch resources to load pages more quickly" ఆప్షన్‌ను చెక్ చేయండి.

టిప్ 5

టిప్ 5

Experimental Canvas Features క్రోమ్ బ్రౌజర్‌లోని Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలంటే..? ‘‘chrome://flags/#enable-experimental-canvas-features''లోకి వెళ్లండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

టిప్ 6

టిప్ 6

Fast tab/window close గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని Fast tab/window close ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ రెస్పాన్స్ టైమ్‌ను పెంచుకోవచ్చు. Fast tab/window close ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి. అడ్రస్ బార్‌లో "chrome://flags/#enable-fast-unload"అని టైప్ చేయండి.

టిప్ 7

టిప్ 7

Scroll Prediction గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిక్షిప్తమై ఉన్న స్ర్కోల్ ప్రెడిక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫింగర్స్ ఫ్యూచర్ పోజిషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే లొకేషన్ బార్‌లో "chrome://flags/#enable-scroll-prediction"అని టైప్ చేయండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Now reply to messages directly from notifications in Chrome Read more News at Gizbot Telugu News
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X