స్మార్ట్ స్కూటర్ వచ్చేసిందోచ్

Written By:

 స్మార్ట్ స్కూటర్ వచ్చేసిందోచ్

భారత్‌కు చెందిన Ather Energy సరికొత్త స్మార్ట్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎస్340 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ స్కూటర్ శక్తివంతమైన లిథియమ్ ఐయోన్ బ్యాటరీ పై రన్ అవుతుంది. ప్రత్యేకింకి అర్బన్ టెక్ లవర్స్ కోసం డిజైన్ చేయబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 60 కిలోమీటర్ల ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

 స్మార్ట్ స్కూటర్ వచ్చేసిందోచ్

72 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచే ఈ స్కూటర్ లో టచ్ స్ర్కీన్ డాష్ బోర్డ్, ప్రొఫైల్ బేసిడ్ సైన్ ఇన్, ఆన్‌బోర్డ్ నేవిగేషన్, ముందస్తుగా కాన్ఫిగర్ చేసిన డ్రైవ్ మోడ్స్ (స్పోర్ట్స్ ఇంకా ఎకానమీ) వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. స్కూటర్‌కు ఇంటిగ్రేట్ చేయబడిన ఎస్340 మొబైల్ యాప్‌కు కనెక్ట్ అవ్వటం ద్వారా రైడర్ తన రూట్ మ్యాప్‌ను స్కూటర్ డాష్ బోర్డ్ పై చూసుకోవచ్చు.

 స్మార్ట్ స్కూటర్ వచ్చేసిందోచ్

మిగిలి ఉన్న బ్యాటరీతో ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చన్న వివరాలను కూడా డాష్‌బోర్డ్ పై తెలుసుకోవచ్చు. వెళ్లే దారిలో మధ్యలో ఎక్కడెక్కడ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయో కూడా ఇందులో చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ వెహికల్‌ని ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనాన్ని డోర్ డెలివరీ చేస్తారు. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Read More : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

English summary
Now Ride Up to 60km/hr in Single Charge with Ather S340 Electric Scooter!. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot