SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India తన కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎం

|

దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India తన కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే వారు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.

SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని SBI నామకరణం చేసింది. దీని ద్వారా మోసాలకు చెక్ పెట్టవచ్చని SBI భావిస్తోంది. కాగా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం. అదెలాగో ఓ సారి చూద్దాం.

 స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.

స్టెప్ 2

స్టెప్ 2

యాప్ డౌన్లోడ్ అయిన తరువాత దాంట్లో మీరు రిజిస్టర్ కావాలి. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అక్కడడ మీకు అకౌంట్ నంబర్ కనిపిస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. తర్వాత 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ఈ రిఫరెన్స్ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ నంబర్ గుర్తు పెట్టుకుని మీరు మీకు దగ్గర్లో ఉన్న యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. అక్కడ ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 5

స్టెప్ 5

మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇలా ప్రతి సారి మీరు పై ప్రాసెస్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
YONO Cash: Now, SBI customers can withdraw cash without ATM cards

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X