ప్రసార భారతి అప్లికేషన్ పేరు 'సైన్సు @ మొబైల్'

Posted By: Prashanth

ప్రసార భారతి అప్లికేషన్ పేరు 'సైన్సు @ మొబైల్'

 

రోజు రోజుకీ మార్కెట్లో పెరుగుతున్న మొబైల్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకోని మొబైల్ ఫోన్ తయారీదారులు, దాని అనుబంధ టెక్నాలజీ దారులు కొత్త కొత్త లాభాలను అందిస్తున్నారు. అటువంటి లాభం ఏమిటంటే 'సైన్సు ఆన్ మొబైల్ ఫోన్స్' క్యాంపెయిన్. ఈ కార్యక్రమాన్ని ప్రసారభారతి మరియు ఇగ్నో సంయుక్తంగా ఇండియా మొత్తం ప్రారంభించనున్నాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సైన్సు పాఠ్య పుస్తకాలను డైరెక్టుగా మీ మొబైల్ ఫోన్స్‌లోకి తీసుకురానున్నారు.

ప్రసార భారతి మరియు ఇగ్నో సంయుక్తంగా విడుదల చేయనున్నక్యాంపెయిన్ అప్లికేషన్ పేరు 'సైన్సు @ మొబైల్'. దీని ద్వారా సైన్సు‌కి సంబంధించిన కంటెంట్ అంతా మీ యొక్క మొబైల్ ఫోన్స్‌లలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ అప్లికేషన్‌లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే సమాచారం మొత్తం కూడా దేనికి అదే గ్రూప్‌‌గా విశీదకరించబడి ఒక పద్దతిలో నిక్షిప్తం చేయబడుతుంది.

సమాచారం మూడు వర్గములుగా విభజించారు. స్టూడెంట్స్‌‌కు ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన లాభం చెయ్యబడుతుంది. ఈ సదుపాయానికి మీరు మీ సెల్ ఫోన్స్ నుండి సబ్ స్క్రైబ్ అవ్వాలనుకుంటే "SCIMBL" అని టైప్ చేసి ఈ 092230516161కు మెసేజ్ పంపగలరు. అలా కాకుండా డైరెక్టుగా విజ్ఞాన్ ప్రసార్ వెబ్‌సైట్ నుండి కూడా సబ్ స్క్రైబ్ అవ్వోచ్చు.

సబ్ స్కైబ్ అయిన తర్వాత ప్రస్తుతానికి సైన్సు‌కు సంబంధించిన సమాచారం ఇంగ్లీషులో పొందుతారు. రాబోయే కాలంలో హిందీలో కూడా సైన్సు సమాచారాన్ని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. 'సైన్సు @ మొబైల్' కార్యక్రమాన్ని అంతర్జాతీయ సైన్సు దినోత్సవం రోజున ప్రవేశపెట్టనున్నారు. ఈ సర్వీసు కి వినియోగదారులు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మారుమూల గ్రామాల్లో ఉంటున్న జనాభాకు సైన్సుని దగ్గరకు చేర్చాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా ఈ సర్వీసుని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot