ఇక పాస్‌వర్డ్ లేకుండా మైక్రోసాఫ్ట్ అకౌంట్లలోకి లాగిన్ కావొచ్చు

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ ఫీచర్ ద్వారా మైక్రోసాఫ్ట్ యూజుర్లు ఎటువంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారా మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లలోకి లాగిన్ కావొచ్చు. ఈ ప్రాసెస్, ఇప్పటికే అందుబాటులో ఉన్న టు-స్టెప్ వెరిఫకేషన్‌తో పోలిస్తే మరింత ఈజీగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

Read More : బాహుబలితో దూసుకొస్తున్న Oppo F3

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Microsoft Authenticator యాప్ ద్వారా..

ఈ సరికొత్త ఆప్షన్‌‌ను iOS అలానే Android Microsoft Authenticator యాప్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్ తన అకౌంట్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అతంటికేటర్ యాప్‌కు యాడ్ చేయటం ద్వారా ఈ ప్రాసెస్ సాధ్యమవుతుంది.

ఫోన్‌కు నోటిఫికేషన్ అందుతుంది

మీ అకౌంట్‌‌ను ఓపెన్ చేయవల్సి వచ్చినప్పుడు కేవలం యూజర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేస్తే చాలు, ఆటోమెటిక్‌గా మీ ఫోన్‌కు ఓ నోటిఫికేషన్ అందుతుంది. ఫోన్‌ను అన్‌లాక్ చేసి నోటిఫికేషన్‌లోని అప్రూవ్ బటన్ పై ట్యాప్ చేస్తే చాలు ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లోకి యాక్సెస్ లభిస్తుంది.

రోజుకు 5జీబి ఇంటర్నెట్, ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్

మీరు తరచూ పాస్‌వర్డ్‌ మరిచిపోతుంటారా..?

ప్రతి ఈమెయిల్ అకౌంట్‌కు పాస్‌వర్డ్ తప్పనిసరి. యూజర్ తన ఈమెయిల్ అకౌంట్‌‍ను ఓపెన్ చేయవల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ లాగిన్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. కొందరు తమ ఈమెయిల్ అకౌంట్‌లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మర్చిపోతుంటారు.

Forgotten Password ఆప్షన్ ద్వారా...

పాస్‌వర్డ్ మరిచిపోయిన సందర్భంలో తిరిగి పాస్‌వర్డ్‌ను పొందేందుకు సదరు వెబ్‌సైట్ సర్వర్ కంప్యూటర్‌కు ఓ రిక్వెస్ట్‌ను పంపాల్సి ఉంటుంది. తద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మెయిల్ సైనప్ పేజీలో కనిపించే Forgotten Password ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా పాస్‌వర్డ్ ను రీసెట్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి. మెయిల్‌ ఎకౌంట్‌ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్‌ మర్చిపోయినా డేటాను రికవర్‌ చేయవచ్చు.

BSNLకు దశ తిరుగుతోందా, నెలలో 29 లక్షల కొత్త యూజర్లు

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌ వాడుకోవచ్చా..?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్ అకౌంట్ నిర్వహణ సాధ్యమైనంటోంది జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్ తప్పని సరిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తన పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్స్‌‍స్టాల్ చేసుకోవాలి.

ఇన్స‌స్టాలేషన్ అనంతరం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి లాగినై జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌ వాడుకోవచ్చా..?

మీరు డౌన్‌లోడ్ చేసిన జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ పేజీలో నిక్షిప్తం కాబడి ఉంటుంది. అప్లికేషన్‌ను లాంఛ్ చేసిన వెంటేనే ‘Allow Offline Mail', ‘Dont allow offline mail' అనే రెండు ఆప్షన్‌లతో కూడిన వెబ్‌పేజీ ప్రత్యక్షమవుతుంది. ‘Allow Offline Mail'ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ స్టోర్ చేస్తుంది. మీరు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసిన ప్రతిసారీ ఇన్‌బాక్స్‌లోని వివరాలు ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లోకి చేరిపోతాయి. ప్రయాణ సందర్భాల్లో ఇంటర్నెట్ సాయంలేకుండానే ఆ వివరాలను మీరు తాపీగా చెక్ చేసుకోవచ్చు.

6జీబి ర్యామ్‌తో Mi 6, ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?

జీమెయిల్ అంకౌట్‌ను తెలుగులో చూడాలంటే..

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

జీమెయిల్ నుంచే అన్ని గూగుల్ సర్వీసులకు దారి..

జీమెయిల్ నుంచి గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను ఒకే క్లిక్కుతో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా జీమెయిల్ ప్రొఫైల్ ఫోటో పక్కనే కనిపించే యాప్స్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డ్రాప్‌డౌన్ మోనూలో గూగుల్ ప్లస్, యూట్యూబ్, గూగుల్ ప్లే, న్యూస్, డ్రైవ్ వంటి సర్వీసులను జాబితాగా పొందవచ్చు. మరిన్ని సర్వీసులను పొందాలనుకుంటే అక్కడే కనిపించే ‘మోర్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

జియో సంచలనం.. రూ.309కే 448జీబి డేటా, 8 నెలలు వాడుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now sign into Microsoft account without password. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting