యూఎస్, కెనడాలకు స్కైప్ ఉచిత కాల్స్

Posted By:

యూఎస్, కెనడాలలో నివశిస్తోన్న మీ మిత్రులు ఇంకా బంధువులకు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని స్కైప్ (Skype) కల్పిస్తోంది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా స్కైప్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా మార్చి 1, 2015 వరకు యూఎస్, కెనడాలలోని ఏ ల్యాండ్‌లైన్ కైనా, మొబైల్ ఫోన్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రత్యేకంగా భారత్ నుంచి యూఎస్, కెనడాలకు కాల్స్ చేసే స్కైప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 యూఎస్, కెనడాలకు స్కైప్ ఉచిత కాల్స్

తామందిస్తోన్న ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా కొత్త సంవత్సరం శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భారత్‌లోని యూజర్లు యూఎస్ ఇంకా కెనడాలలో నివశిస్తోన్న తమ మిత్రులు, బంధువులతో నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని స్కైప్ తెలిపింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రముఖ వాయిస్ కాలింగ్ యాప్ స్కైప్ వెబ్ బ్రౌజర్ ఆధారిత వర్షన్‌ను ఇటీవల ప్రకటించింది. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ వెసలుబాటతో స్కైప్ యూజర్లు అన్ని వెబ్ బ్రౌజర్‌ల నుంచి స్కైప్ ఆడియో, వీడియో కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. యూజర్లు తమ స్కైప్ అకౌంట్‌లలోకి ఫైర్‌ఫాక్స్, క్రోమ్, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ల ద్వారా లాగిన్ కావచ్చని సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది. స్కైప్ వెబ్ ఆధారిత వర్షన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యూజర్లు నేరుగా వెబ్ బ్రౌజర్ నుంచే కాలింగ్ ఇంకా చాటింగ్ నిర్వహించుకోవచ్చు.

నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype) ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్‌లకు కాల్స్ చేసుకోవచ్చు అలానే వీడియో చాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Now, Skype users in India can call numbers in US, Canada for free. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot