ఈ స్మార్ట్‌పెన్... తప్పు రాస్తే అరుస్తుంది!

Posted By:

ఈ స్మార్ట్‌పెన్... తప్పు రాస్తే అరుస్తుంది!
లండన్: అక్షరక్రమం లేదా వ్యాకరణ తప్పులను పసిగట్టే హై-టెక్ స్మార్ట్‌పెన్‌ను తాము వృద్ధి చేసినట్లు ప్రముఖ జర్మన్ సంస్థ ‘లిర్న్ స్టిఫ్ట్' తెలిపింది. ఈ స్మార్ట్‌కలం ద్వారా అన్నివయస్కుల వారు రాయడం నేర్చుకోవచ్చట. ఉదాహరణకు మీరు ఈ స్మార్ట్‌పెన్‌తో రాస్తున్నట్లయితే అక్షరదోషం లేదా వ్యాకరణ తప్పు తలెత్తిన ప్రతిసారి సదరు పెన్ వైబ్రేషన్‌ను విడుదల చేసి మీ చేతిని అలర్ట్ చేస్తుంది.

ఇందుకుగాను ప్రత్యేక సెన్సార్‌లను స్మార్ట్‌పెన్‌లో నిక్షిప్తం చేసినట్లు రూపకర్తలు ఫాల్క్ ఇంకా మేండీ వోల్సీలు డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. యూజర్లు ఈ స్మార్ట్‌పెన్‌ను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు చక్కటి దస్తూరి ఇంకా వర్ణ క్రమ రీతిలలో ఈ స్మార్ట్‌పెన్‌ రాతను నేర్పిస్తుంది. ఈ తరహా స్మార్ట్‌పెన్‌లు రాత పట్ల మక్కువను మరింత పెంచుతాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పూర్వీకులు కుంచెతో రాతపోతల సాగించేవారు. తరువాతి క్రమంలో ఇంకు పెన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాలానుగుణంగా బాల్ పాయింట్, జెల్ ఇంక్ ఇలా అనేక మోడళ్లలో పెన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఆధునికత పుణ్యమా అంటూ కలాలు సైతం సాంకేతికతను రంగరించుకుంటున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting