మరీ ఇంత పిచ్చా...సెల్ఫీ కోసం హంసనే చంపేసింది

Written By:

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. ఇప్పుడు ఎక్కడవిన్నా ఈ పదం వైరల్ లా వినబడుతుంది.. అంతేకాదు మన కంటి ముందు కనబడుతుంది కూడా. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో సెల్ఫీ తీసుకోవడం పెద్ద విషయం కాదు. అలాగే సాహసం చేయడం కూడా పెద్ద విషయం కాదు. అయితే కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఇమిడిపోయి, పదిమందికీ గొప్పగా చూపించుకోవాలన్న యావ కొందరిలో బాగా పెరిగిపోతోంది.

Read more: 2015లో అత్యంత చెత్త సెల్ఫీ ఇదే

మరీ ఇంత పిచ్చా...సెల్ఫీ కోసం హంసనే చంపేసింది

అలా అనుకుని ఓ హంస ప్రాణాన్నినిలువునా తీసింది ఓ అమ్మడు. మీడియా కథనాల ప్రకారం మేసిడోనియన్ సరస్సుకు వచ్చిన ఓ టూరిస్టు రకరకాల భంగిమల్లో సెల్ఫీలు దిగింది. ఆ సరస్సులో ఉన్న ఓ హంసను బయటికి లాగి, మరో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత ఆ హంస గురించి పట్టించుకోవడం మానేసి తన మానాన తాను వెళ్ళిపోయింది.

Read more: 30 భయానక సెల్ఫీ చిత్రాలు!

మరీ ఇంత పిచ్చా...సెల్ఫీ కోసం హంసనే చంపేసింది

ఆ టూరిస్టు బల్గేరియా నుంచి వచ్చిందట. సరస్సులో ఈదుతున్న హంసను కనికరం లేకుండా రెక్క పట్టుకుని ఈడ్చేసినట్లు ఫొటోలో కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ఫీ తీసుకునేటపుడు హంసను ఆమె హింసించిందో, లేదో తెలియడం లేదు.

మరీ ఇంత పిచ్చా...సెల్ఫీ కోసం హంసనే చంపేసింది

ఆమె సెల్ఫీ తీసుకుని, వదిలేసిన తర్వాత ఆ హంస కదలకుండా పడి ఉండిపోయింది. ఆ తర్వాత చూస్తే చనిపోయి ఉంది. యూరోపులోనే అత్యంత లోతైన, పురాతనమైనదిగా పేరు పొందిన లేక్ ఆర్చిడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అదొక్కటే కాదు ఇక్కడ చూడండి సెల్ఫీల కోసం ఎలా పడి చస్తున్నారో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నీటిలోపల చావుతో చెలగాటమాడుతూ

1

నీటిలోపల చావుతో చెలగాటమాడుతూ మంచి సెల్పీ కోసం ఆరాటపడుతున్న చిత్రం.ఇతగాడు ఇంకా నాతో సెల్పీ దిగేందుకు ఎవరు వస్తున్నారంటూ కామెంట్ కూడా పెట్టాడు దీనికి.

 

 

10 వేల అడుగుల ఎత్తు..

2

10 వేల అడుగుల ఎత్తు..కిందకు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటి చోట నుంచి మనోడు ఏకంగా దూకుతూ సెల్ఫీ తీసుకున్నాడు

 

 

రక్తం రుచి మరిగిన షార్క్ చేపల మధ్య సెల్ఫీ

3

రక్తం రుచి మరిగిన షార్క్ చేపల మధ్య సెల్ఫీ

 

 

ఆకాశ దేశాన పయనిస్తూ సెల్ఫీ

4

ఆకాశ దేశాన పయనిస్తూ సెల్ఫీ. అక్కడ నుంచి కింద పడితే ఇంక అంతే సంగతులు

 

 

ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం నుంచి సెల్ఫీ

5

మేము ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం నుంచి సెల్ఫీ దిగుతున్నామంటున్న ఓ క్రేజీ యువత

 

 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జీసస్ విగ్రహంపై నుంచి సెల్ఫీ

6

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జీసస్ విగ్రహంపై నుంచి సెల్ఫీ తీసుకుంటున్న ఓ యువకుడు..పైగా జీసస్ తో సమావేశంలో ఉన్నారట.

 

 

నిప్పులు చిమ్మకుంటూ వెళుతున్న రాకెట్ మరో పక్క సెల్ఫీ

7

ఓ పక్క నిప్పులు చిమ్మకుంటూ వెళుతున్న రాకెట్ మరో పక్క సెల్ఫీ

 

 

బొమ్మ తుఫాకితో సెల్పీ దిగుదామని

బొమ్మ తుఫాకితో సెల్పీ దిగుదామని

బొమ్మ తుఫాకితో సెల్పీ దిగుదామని ప్రయత్నించి పోలీసుల చేతిలో చావును కొని తెచ్చుకున్న యువకుడు ఉదంతం మనకు తెలిసిందే.

ఎగురుతున్న విమానంలో నుంచి

9

ఎగురుతున్న విమానంలో నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ఫైలెట్ తో పాటు ప్రయాణికుడు చనిపోయిన ఘటన

 

 

ఆగ్రాలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా

10

ఆగ్రాలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి సెల్ఫీ.. అనంతలోకాలకు పయనం

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Tourist In Greece Pulls A Swan Out Of The Water, Drags It Along The Beach For The Perfect Selfie
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot