UPI చెల్లింపులలో భారీ మార్పులు ఏంటో మీరే చూడండి
మీ ఫోన్ లో Google Pay, PhonePe, Whatsapp Payments, BHIM వంటి వివిధ రకాల పద్ధతుల ద్వారా మీ స్నేహితులకు తరచూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు UPI చెల్లింపులలో భారీ మార్పులు వచ్చాయి.
మీ ఫోన్ లో Google Pay, PhonePe, Whatsapp Payments, BHIM వంటి వివిధ రకాల పద్ధతుల ద్వారా మీ స్నేహితులకు తరచూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు UPI చెల్లింపులలో భారీ మార్పులు వచ్చాయి.ఇంతక ముందు 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 20 UPI లావాదేవీలు చేసుకోవడానికి వీలు పడేది అయితే తాజాగా మార్చబడిన రూల్స్ ప్రకారం గరిష్టంగా ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా 24 గంటల వ్యవధిలో కేవలం 10 లావాదేవీలు మాత్రమే చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఈ శీర్షికలో భాగంగా అమల్లోకి తీసుకురాబడిన కొత్త రూల్స్ ను మీకు తెలుపుతున్నాము ఓ లుక్కేయండి...

కేవలం 10 లావాదేవీలు మాత్రమే....
ఇప్పటివరకు 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 20 UPI లావాదేవీలు చేసుకోవడానికి వీలు పడేది. కానీ తాజాగా మార్చబడిన రూల్స్ ప్రకారం గరిష్టంగా ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా 24 గంటల వ్యవధిలో కేవలం 10 లావాదేవీలు మాత్రమే చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అంతేకాదు కేవలం ఒక్క రోజు వ్యవధిలో గరిష్టంగా లక్ష రూపాయలకు మించి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సాధ్యపడదు.

మూడు వేర్వేరు బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నట్లయితే....
ఒకవేళ మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్‌కి లింకు చేయబడి మూడు వేర్వేరు బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నట్లయితే 24 గంటలు ఇలా మొత్తం ఒక్కోదానికి పది చొప్పున గరిష్టంగా 30 UPI లావాదేవీలు చేసుకోవడానికి సాధ్యపడుతుంది.

ఈ పరిమితి కేవలం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయబడే అమౌంట్ కి మాత్రమే వర్తిస్తుంది.....
అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఈ పరిమితి కేవలం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయబడే అమౌంట్ కి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్లి, లేదా రెస్టారెంట్ కి వెళ్లి UPI పద్ధతిలో చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి పరిమితి లేకుండా రోజు మొత్తం మీద కావాల్సిన అన్ని లావాదేవీలు చేసుకోవచ్చు.

ఒక రోజులో మీరు మొట్టమొదటి UPI లావాదేవీ ద్వారా....
ఒక రోజులో మీరు మొట్టమొదటి UPI లావాదేవీ ద్వారా మీ మిత్రులకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన క్షణం నుండి లెక్కించబడి రాబోయే 24 గంటల వ్యవధిలో గరిష్టంగా మరో తొమ్మిది లావాదేవీలు మాత్రమే చేసుకోవడానికి వీలు అవుతుంది.


Click it and Unblock the Notifications








