గూగుల్ క్రోమ్‌ను నోట్‌ ప్యాడ్‌లా వాడుకోవటం ఎలా..?

|

గూగుల్ క్రోమ్, మనకో బ్రౌజర్‌గానే సుపరిచితం. నమ్మకమైన వెబ్ బ్రౌజర్‌లలో ఒకటైన గూగుల్ క్రోమ్ ద్వారా అనేక ప్రయోజనాలను మనం పొందగలుగుతున్నాం. ఈ బ్రౌజర్ కోసం అనేకమైన ఎక్స్‌టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అదనపు సౌకర్యాలను మనం ఆస్వాదించవచ్చు. క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌లో ఒకటైన "New Tab Draft" ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది. ఈ ఎక్స్‌టెన్షన్స్‌ సహాయంతో బ్రౌజర్‌ను నోట్‌ ప్యాడ్‌లా మార్చేసుకుని నోట్స్ రాసుకోవచ్చు.

 గూగుల్ క్రోమ్‌ను నోట్‌ ప్యాడ్‌లా వాడుకోవటం ఎలా..?

Read More : షాకింగ్.. కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను పొందేందుకు, బ్రౌజర్ పైభాగంలో కుడివైపున కనిపించే సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులో More Tools ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకోండి. మోర్ టూల్స్ ఆప్షన్‌లో కనిపించే ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌ను క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న అనేక ఎక్స్‌టెన్షన్లు కనిపిస్తాయి.వాటిలో "New Tab Draft" ఎక్స్‌టెన్షన్‌ను సెలక్ట్ చేసుకుని Add to Chrome పై క్లిక్ చేసినట్లయితే, ఆ ఎక్స్‌టెన్షన్‌ మీ బ్రౌజర్‌కు యాడ్ అవుతుంది.

ఎక్స్‌టెన్షన్‌ యాడ్ అయిన తరువాత కొత్త ట్యాబ్‌‍ను ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు బ్లాంక్‌పేజ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు టైప్ చేసే టెక్స్ట్ బ్రౌజర్‌లో సేవ్ కాబడుతుంది.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

అనవసరమైన ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఇంచుమించుగా ఎక్స్‌టెన్షన్స్ మాదిరగానే ఉంటాయి. ఇవి మీ బ్రౌజర్‌ పనితీరును అదనంగా పెంచటంలో తోడ్పడతాయి. అయితే అవసరం లేని ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయాలంటే..? ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://plugins"అని టైప్ చేయండి.  ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన ప్లగిన్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న plugins పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

అవసరం లేని ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయాలంటే..?  ముందు క్రోమ్ లొకేషన్ బార్ లో chrome://extensionsఅని టైప్ చేయండి.  ఇప్పుడు మీరు క్రోమ్ Options > More tools > Extensionsలోకి వెళతారు ఇక్కడ మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న ఎక్స్‌టెన్షన్‌ల పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?
 
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసిన HTML5, CSS, JavaScript యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.  ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://apps"అని టైప్ చేయండి.  ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన వెబ్ యాప్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న యాప్ పై రైట్ క్లిక్ చేసి Remove from Chrome ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. యాప్స్ రిమూవ్ కాబడతాయి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకున్నట్లయితే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేకమైన ఇంటెలిజెంట్ ఫీచర్లతో వస్తోంది. వీటిలో నెట్‌వర్క్ ప్రెడిక్షన్, స్పెల్లింగ్ కరెక్షన్, రిసోర్స్ ప్రీలోడర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ రిసోర్స్ ప్రీ-ఫెట్చర్ ఫీచర్లు మీ ఓపెన్ చేసే వెబ్ పేజ్ లేదా లింక్స్‌కు సంబందించి తెలివైన సలహాలను అందిస్తాయి. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ బ్రౌజర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకోవాలంటే..? క్రోమ్ ఆప్షన్స్ లోని Settings > Show advanced settingsలోకి వెళ్లండి "Prefetch resources to load pages more quickly" ఆప్షన్‌ను చెక్ చేయండి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

క్రోమ్ బ్రౌజర్‌లోని Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలంటే..? ‘‘chrome://flags/#enable-experimental-canvas-features''లోకి వెళ్లండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని Fast tab/window close ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ రెస్పాన్స్ టైమ్‌ను పెంచుకోవచ్చు. Fast tab/window close ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి. అడ్రస్ బార్‌లో "chrome://flags/#enable-fast-unload"అని టైప్ చేయండి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిక్షిప్తమై ఉన్న స్ర్కోల్ ప్రెడిక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫింగర్స్ ఫ్యూచర్ పోజిషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే లొకేషన్ బార్‌లో "chrome://flags/#enable-scroll-prediction"అని టైప్ చేయండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని టైల్స్‌ను గరిష్టంగా పెంచుకోవటం ద్వారా వాటిని వేగంగా ఓపెన్ చేసుకోవచ్చు. "chrome://flags/#max-tiles-for-interest-area"లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూలోని 512 ను ఎంపిక్ చేసుకోవటం ద్వారా టైల్స్‌ను పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మాల్వేర్లు మీ బ్రౌజర్‌ను పూర్తిగా ధ్వంసం చేయగలవు. కాబట్టి, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్ మీ పీసీలో తప్పనిసరిగా ఉండాలి.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం మరింతగా పెరగాలంటే..?

ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Now Use Your Google Chrome To Take Notes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X