బూతు సినిమాలు, సెక్సు టేపులు గూగుల్ టివిలో..

Posted By: Staff

బూతు సినిమాలు, సెక్సు టేపులు గూగుల్ టివిలో..

లండన్: లాస్ ఏంజిల్స్ అడల్ట్ ఎంటర్టెన్మెంట్ కంపెనీ అయిన 'వివిడ్ ఎంటర్టెన్మెంట్' గూగుల్ టివి కొసం ప్రత్యేకంగా ఓ అప్లికేషన్‌ని రూపొందించడం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్స్‌కు వివిడ్ ఎంటర్టెన్మెంట్ కంపెనీలో ఉన్న సెలబ్రిటీల సెక్స్ టేపులు, బూతు సినిమాలుకు సంబంధించిన టేపులన్నీ కూడా హై డెఫినేషన్ యాక్సెస్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అందించిన సమాచారం ప్రకారం వివిడ్ ఎంటర్టెన్మెంట్ సంస్ద మొట్టమొదటి టివి అప్లికేషన్‌ని గూగుల్ టివి సెట్ టాప్ డివైజ్ ద్వారా సెక్సువల్ కంటెంట్‌కి సంబంధించిన సినిమాలు, సెలబ్రిటీల సెక్స్ టేపులను ప్రదర్శించనుందని సమాచారం. ఈ విషయాన్ని వివిడ్ ఎంటర్టెన్మెంట్ సహా వ్యవస్దాపకుడు, చైర్మన్ అయిన స్టీవెన్ హిర్చ్ వెల్లడించారు.

ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ గూగుల్ టివి ఛానల్‌తో మా అనుబంధం కొనసాగించడం వల్ల ఎవరైతే అభిమానులు ఉన్నారో వారు సెక్సువల్ కంటెంట్ ని డైరెక్టుగా ఈ గూగుల్ ఛానల్ ద్వారా వారియొక్క టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్, మొబైల్స్, టెలివిజన్స్‌లలో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వివిడ్ అప్లికేషన్ అభిమానులకు అవార్డు విన్నింగ్ అడల్ట్ సినిమాలు, సెలబ్రటీ సెక్సు టేపులతో పాటు 18 సంవత్సరాలు వయసు పైబడిన వారికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot