ఏటీయంకు వెళ్శి బరువుని చూసుకోవడమే కాదు, క్రొత్త సర్వీసులు

Posted By: Staff

ఏటీయంకు వెళ్శి బరువుని చూసుకోవడమే కాదు, క్రొత్త సర్వీసులు

ATM ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీయం)ను వ్యాపారపరంగా మొదటి సారి 1960 లో ప్రవేశపెట్టారు. 2005 నాటికి ప్రపంచంలో 15 లక్షల ఏటీయంలు వాడుకలో ఉన్నాయి. ఈ ఏటీయంల ద్వారా ఆర్ధిక సంస్థలు వారి వినియోగదారులకు 24 X 7, అంటే వారంలోని ఏడు రోజులూ, రోజుకి ఇరవై నాలుగు గంటలూ సేవలందించడానికి సాంకేతిక పరంగా దోహదపడ్డాయి. ఈ ఏటీయంల వలన వినియోగదారులు ఎప్పుడైనా, వారికి చేరువలో ఉన్న ఏటీయం నుండి నగదు తీసుకునే వెసులుబాటు కలిగింది.

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ వినియోగం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ ఏటీఎంలను బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు ఈ ఏటీయం నుండి మరో క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చదవాల్సిందే...

రోజు వారి జిమ్‌కు వెళ్లి కసరత్తు చేసి ఒంట్లోని కొవ్వు కరిగించుకున్నా.. ఎంత బరువు తగ్గారో తెలుసుకోవాలంటే ఎం చేయాలి నేరుగా ఏటీయంకు వెళ్లి మీరు ఎంత బరువు తగ్గారో చూసుకోవచ్చు. లేదా వేసవిలో మీరు సేద తీరేందుకు ఏదైనా హిల్‌స్టేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారా... ఎయిర్‌లైన్‌ కు డబ్బుచెల్లించాలంటే మళ్లీ తిరిగి ఎటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిందే. ఆటోమెటిక్‌ టెల్లర్‌ మిషిన్‌గా పిలవబడే (ఏటీ ఎం)లు కేవలం డబ్బువిత్‌డ్రా చేసుకునే యంత్రాలే కాకుండా బ్యాంకులు వినియోగదారులకు మరింత సేవలు అందించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి.

ఇండియన్‌ బ్యాంకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌తో టై అప్‌ చేసుకు ని.. విమాన చార్జీలను ఇండియన్‌ బ్యాంకు ద్వారా చెల్లించే విధం గా ఒప్పందం కుదుర్చుకుంది. లక్ష్మీ విలాసబ్యాంకు బెంగళూరులో తమ ఎటీయంలలో ఎత్తు, బరువు కొలిచే సాధనాన్ని అమర్చింది. పలు బ్యాంకులు వివిధ రకాల వ్యాల్యూ యాడెడ్‌ సేవలను అందిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపు.. ఒకటైతే మొబైల్‌ఫోన్‌లకు రీచార్జి చేసుకునే వెసలుబాటు కాగా...మరోకటి ఏటీయంల ద్వారా డీటిహెచ్‌ను కూడా చార్జీ చేసుకునే వెసలుబాటు అమల్లోకి వచ్చింది.

రోజు రోజుకు భారత్‌లో ఎటీయం వినియోగం పెరిగి పోతోంది. బ్యాంకుల కు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకునే వారు చాలా తక్కు వ మంది ఉన్నారు. ఎక్కువ శాతం మంది ఎటీయంపైనే ఆధార పడుతున్నారు. అయితే ఎటీఎంలలో బరువు కొలిచే సాధనాలు ఎందుకు అమరుస్తున్నారనే విషయానికి వస్తే లక్ష్మీ విలాస బ్యాంకు సీఈఓ మాట్లాడుతూ వినియో గదారుడు తమలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా తెలుసుకునేందుకు బాడీమాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారని... అందుకే తాము తమ ఎటీఎంలలో బరువును కొలిచే సాధనాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. పట్టణప్రాంతాల్లో బీఎంఐ కొలిచే సాధనాన్ని కనీసం 40-50 ఎటీఎంలలో అమర్చాలను కుంటు న్నట్లు ఆయన చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లు... ఎయిర్‌లైన్‌ టికెటింగ్‌ ప్రవేశపెడతామని చెప్పారు.

అయితే వచ్చిన చిక్కల్లా బ్యాంకు జాగ్రత్త పడాల్సిన అంశం ఏమిటంటే ఈ అదనపు సేవలు ప్రారంభించి నందు వల్ల ఏటీయం కంటౌర్ల భారీ రద్దీ ఏర్పడకుండా చూడాలి. ఎటీయంలలో రద్దీ ఎక్కువడా ఉన్నట్లయితే ఆ సేవల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ఉత్తమ మం దీని వల్ల రద్దీని తప్పించవచ్చునని పలువురు బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు. ప్రస్తుతానికి దేశంలో మొత్తం 45,000 ఏటీయంలు పనిచేస్తున్నయని ఒక అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot