గూగుల్ పే యాప్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలా ?

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటిదాకా న‌గ‌దు బ‌దిలీలు, బిల్ పేమెంట్స్‌, రీచార్జ్లు చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. వీటితో పాటు ప్ర‌స్తుతం అందులో క్యాబ్‌,

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటిదాకా న‌గ‌దు బ‌దిలీలు, బిల్ పేమెంట్స్‌, రీచార్జ్లు చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. వీటితో పాటు ప్ర‌స్తుతం అందులో క్యాబ్‌, బ‌స్ టిక్కెట్ బుకింగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఇక‌పై గూగుల్ పే యాప్‌లో రైల్వే టిక్కెట్ల‌ను కూడా బుక్ చేసుకోవ‌చ్చు. ఇండియ‌న్ రైల్వేస్‌తో భాగ‌స్వామ్యం అయిన గూగుల్ ఐఆర్‌సీటీసీతో క‌ల‌సి రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకునే స‌దుపాయాన్ని ప్రారంభించింది.

 
గూగుల్ పే యాప్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలా ?

అంతే కాకుండా గూగుల్ పే యాప్ ద్వారా రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటే ఎలాంటి అద‌న‌పు చార్జిల‌ను చెల్లించాల్సి ప‌నిలేద‌ని ఐఆర్‌సీటీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తున్న గూగుల్ పే యాప్‌లో యూజ‌ర్లు ప్ర‌స్తుతం ట్రెయిన్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు..!

గూగుల్ పే యాప్

గూగుల్ పే యాప్

ఇకపై రైలు టికెట్ బుక్ చేయడానికి మీ ఫోన్‌లో ఐఆర్‌సీటీసీ యాప్ లేకపోయినా గూగుల్ పే యాప్ ఉంటే చాలు. టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, ట్రెయిన్ స్టేటస్ లాంటి సేవల్ని పొందొచ్చు. అయితే ఇలా చేయాలంటే మీకు ముందుగానే ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉండాలి. గూగుల్ పే యాప్‌లో ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం సాధ్యం కాదు.

ఎలా బుక్ చేయాలి

ఎలా బుక్ చేయాలి

ముందుగా మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. తర్వాత కనిపించే పేజీలో 'Book train tickets' అనే ఆప్సన్ క్లిక్ చేయాలి. మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం, తేదీ, కోటా వివరాలు అందులో ఎంటర్ చేయాలి. మీరు ఏ రైలు ఎక్కాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకుని ఆ తర్వాత మీ ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్, పేరు, ఫోన్‌ నెంబర్, వయస్సు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి పేజీలో ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.

IRCTC TikTok Contest
 

IRCTC TikTok Contest

ఇదిలా ఉంటే #HoliwithIRCTC పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ కాంటెస్ట్ ప్రకటించింది. Holi పర్వదినాన్ని మరింత ఆనందకరంగా జరుపుకునేందుకు ఈ కాంటెస్ట్ తీసుకువచ్చింది. దీి ద్వారా మీరు మీ ఫోన్‌లోని టిక్‌టాక్ యాప్‌లో ఏదైనా బాలీవుడ్ హోళీ పాటకు పెర్ఫామ్ చేసి ప్రైజులు గెలుచుకోవచ్చు.

మీరు చేయాల్సింది

మీరు చేయాల్సింది

మీ పాటను టిక్‌టాక్ యాప్‌లో రికార్డ్ చేయాలి. మీకు ఆ పాట ఎందుకు ఇష్టమో అందులో తెలపాలి. దాంతోపాటు మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏదో కూడా చెప్పాలి. ఆ వీడియోను ఐఆర్‌సీటీసీకి పంపాలి. కంటెస్టెంట్స్ పంపిన వీడియోల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి ప్రైజులు ప్రకటించనుంది. మరిన్ని వివరాలకు IRCTC ట్విట్టర్ పేజీని చూడవచ్చు.

Best Mobiles in India

English summary
How to book train tickets in India straight from the Google Pay app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X