ఇలా చేసి, రూ.2 వేలకే Asus ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయండి!

|

మీరు తక్కువ బడ్జెట్ లో ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అది కూడా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా. అయితే, ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రూ.2,000తో కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నేటి ప్రపంచంలో రెండు వేల రూపాయలతో ఏ స్మార్ట్‌ఫోన్‌నే కొనుగోలు చేయలేము.. ల్యాప్టాప్ ఎలా కొనుగోలు చేయగలం అని ఆలోచిస్తున్నారా.

 
ఇలా చేసి, రూ.2 వేలకే Asus ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయండి!

అవును, మీ కోసం Flipkart లో ఒక అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. దాని ద్వారా ఇంత తక్కువ ధరకు ల్యాప్‌టాప్ కొనాలనే కలను సాకారం చేసుకోవచ్చు. మీరు చౌకగా ల్యాప్‌టాప్‌ను ఎక్కడ మరియు ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ఇది చదవండి.

రూ.2000లోపు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయండి;

రూ.2000లోపు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయండి;

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న పలు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు రూ.2000లో ల్యాప్‌టాప్ (భారతదేశంలో అత్యంత చౌకైన ల్యాప్‌టాప్) కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000కి ఆఫర్ కింద ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. రూ.22,990 విలువైన ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.2000కే కొనుగోలు చేసేలా ధర తగ్గింపుతో పాటు మరిన్ని ఆఫర్‌లు ఇస్తున్నారు.

రూ.4వేల తగ్గింపు ఉంది;

రూ.4వేల తగ్గింపు ఉంది;

Flipkart తక్కువ ధరకే Asus ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. Asus Chromebook Celeron Dual Core అసలు ధర రూ.22,990 గా ఉంది. అయితే, ప్రస్తుతం దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధరపై 17 శాతం తగ్గింపు వర్తించబడింది. దీంతో, ఈ ల్యాప్‌టాప్ రూ.4వేల తగ్గింపుతో కలిపి రూ.18,990కి జాబితా చేయబడింది.

2,000 రూపాయలకు ల్యాప్‌టాప్‌ని ఎలా పొందగలం?
 

2,000 రూపాయలకు ల్యాప్‌టాప్‌ని ఎలా పొందగలం?

Asus Chromebook Celeron Dual కోర్ ల్యాప్‌టాప్ ధర తగ్గింపుతో కలిపి ప్రస్తుతం రూ.18,990 ధరకు జాబితా చేయబడింది. అయితే, దీనిపై ధర తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ పై రూ.17,000 వరకు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ఆఫర్ ఉంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ లో తీసుకుంటే.. మీకు అది కేవలం రూ.1990 వరకు ఉంటుంది. అయితే, ఎక్స్చేంజ్ విలువ అనేది మీరు ట్రేడింగ్ చేస్తున్న డివైజ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

Asus Chromebook: పనితీరు;

Asus Chromebook: పనితీరు;

Asus Chromebook CX1101 ల్యాప్ టాప్ అత్యుత్తమ Intel Celeron N4020 ప్రాసెసర్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది రెండు కోర్లను కలిగి ఉంది మరియు నవంబర్ 2019లో విడుదలైన జెమిని లేక్ ఫ్యామిలీ లైనప్‌ను పంచుకుంటుంది. సంవత్సరాలుగా విడుదలైన అనేక Chromebookల కోసం N4020 అత్యంత విజయవంతమైన ప్రాసెసర్. రెండు కోర్లతో, మీరు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 600ని పొందుతారు. ఈ ధరలో ఈ ల్యాప్టాప్ అద్భుతంగా ఉంటుంది.

అదేవిధంగా, ప్రస్తుతం మోటో డేస్ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ లో Motorola Edge 30 Ultra రూ.5,000 తగ్గింపు ఉంది. అది కూడా తెలుసుకోండి;

అదేవిధంగా, ప్రస్తుతం మోటో డేస్ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ లో Motorola Edge 30 Ultra రూ.5,000 తగ్గింపు ఉంది. అది కూడా తెలుసుకోండి;

Motorola Edge 30 Ultra ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.54,999కి జాబితా చేయబడింది. ఇది వాస్తవానికి భారతదేశంలో 59,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. అంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కస్టమర్లు రూ.5,000 తగ్గింపును పొందుతున్నారు. పైన పేర్కొన్న తగ్గింపు ధర 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ పై అందుబాటులో ఉంది.

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్లు:

Motorola Edge 30 Ultra స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్‌తో, కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ డివైజ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్జ్ లైటింగ్‌తో వస్తుంది. డిస్ప్లే ముందు మరియు వెనుక రెండింటిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ర్యామ్ మ‌రియు స్టోరేజీ విష‌యానికొస్తే.. 8GB వరకు LPDDR5 RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజీని అందించారు.

కెమెరా ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌:
ఫోటోలు మరియు వీడియోల కోసం, Motorola Edge 30 Ultra మొబైల్‌కు బ్యాక్‌సైడ్‌ 200-మెగాపిక్సెల్ Samsung సెన్సార్ (0.64 µm పిక్సెల్ పరిమాణం)తో వస్తుంది, అది f/1.9 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడింది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని పొందుతుంది.
Motorola Edge 30 Ultra మొబైల్ 4,610 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. దాంతో పాటుగా, 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క‌లిగి ఉంది. ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై మొదలైన సాధారణ భద్రత మరియు కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Now You can buy Asus chromebook laptop at just Rs.2000, check full details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X