Home
News

Redmi Note 11SE స్మార్ట్‌ఫోన్ పై Flipkart లో అద్భుతమైన ఆఫర్!

మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం మీకు సరైనది. ఎందుకంటే ప్రస్తుతం Redmi కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పై మంచి డీల్ అందుబాటులో ఉంది. Redmi Note 11 SE (Bifrost Blue, 64GB) (6GB RAM) మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్ లో ధర తగ్గింపుతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ వివరాలను గురించి మీ కోసం మేం అందిస్తున్నాం. స్పెసిఫికేషన్లతో పాటు, ఫోన్ యొక్క కొన్ని ఫీచర్ల గురించి కూడా మేము మీకు తెలియజేస్తాము. మీరు ప్రస్తుతం మొబైల్ కొనుగోలు చేయడం కోసం చూస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

Redmi Note 11 SE పై డిస్కౌంట్;

Redmi Note 11 SE పై డిస్కౌంట్;

Redmi Note 11 SE (Bifrost Blue, 64GB) (6GB RAM) మీకు మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్ యొక్క MRP ధర వచ్చేసి రూ.16,999 గా ఉంది. అయితే, ప్రస్తుతం దీనిపై 23% తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో ఇది మీకు కేవలం రూ.12,999కి కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుంది. అలాగే, అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా దీనిపై వర్తిస్తాయి. మీరు ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించినప్పుడు 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Redmi Note 11 SEలో ఎక్స్ఛేంజ్ ఆఫర్;

Redmi Note 11 SEలో ఎక్స్ఛేంజ్ ఆఫర్;

ఇప్పుడు మీరు ఫోన్‌పై అతిపెద్ద తగ్గింపును పొందగల ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. ఈ తగ్గింపు అనేది ట్రేడ్-ఇన్ (ఎక్స్చేంజ్) ఆఫర్ గా చెప్పొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే, మీరు దానిని ఫ్లిప్‌కార్ట్‌కు మాత్రమే తిరిగి ఇవ్వవచ్చు. దానికి బదులుగా, మీరు రూ.12,000 వరకు తగ్గింపు పొందవచ్చు, కానీ మీరు గరిష్ఠంగా తగ్గింపు పొందడానికి, మీ పాత ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. ఎక్స్చేంజ్ తగ్గింపు అనేది ఫోన్ పనితీరుతో పాటు ఫోన్ మోడల్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.

Redmi Note 11 SE ఫీచర్లు మరియు కెమెరాలు;

Redmi Note 11 SE ఫీచర్లు మరియు కెమెరాలు;

మీరు ఈరోజు Redmi Note 11 SEని ఆర్డర్ చేస్తే, అది నవంబర్ 9 నాటికి మీ ఇంటి వద్దకే చేరుతుంది. ఈ ఫోన్ 16.33 సెం.మీ (6.43 అంగుళాల) ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. Redmi Note 11 SE వెనుక భాగంలో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. సెల్ఫీ మరియు వీడియో చాట్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. ఇందులో మెయిన్ కెమెరా నైట్ మోడ్, AI బ్యూటిఫై మరియు బోకె మరియు డెప్త్ కంట్రోల్‌తో కూడిన AI పోర్ట్రెయిట్ మోడ్‌తో వస్తుంది.

ఇందులో 5000 mAh సామర్థ్యం కలిగిన లిథియం పాలిమర్ బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్‌లో Mediatek Helio G95 octa-core ప్రాసెసర్‌ని అమర్చారు. ఇది డ్యూయల్-సిమ్ నానో-స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 తో రన్ అవుతుంది. అలాగే ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

Redmi Note 11 SE కలర్-ఆప్షన్లు;

Redmi Note 11 SE కలర్-ఆప్షన్లు;

భారతదేశంలో Redmi Note 11 SE ధర 6GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్‌కు రూ.12,999 తగ్గింపు లో అందుబాటులో ఉంది. ఫోన్ వైట్, బ్లాక్, థండర్ పర్పుల్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అయితే, ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు.

Best Mobiles in India

English summary
Now you can buy Redmi note 11 SE at lowest price. check details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X