UPI చెల్లింపులు ఇక ఉచితం కాదా...? వివరాలు తెలుసుకోండి.

By Maheswara
|

2021 నూతన సంవత్సరం నుండి UPI లావాదేవీలు ఉచితం కాదు. మీరు చేసే త్రన్సచ్తిఒన్ లకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అని గత కొన్ని రోజులుగా వ్యాపిస్తున్న వదంతులను NPCI (నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా )కొట్టి పారేసింది. UPI లావాదేవీలకు సంబంధించిన ఈ పుకార్ల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

 

యుపిఐ లావాదేవీలకు అదనపు ఛార్జీలు

యుపిఐ లావాదేవీలకు అదనపు ఛార్జీలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ లావాదేవీలకు అదనపు ఛార్జీలు విధించదని తెలిపింది. 2021 నుండి యుపిఐ లావాదేవీలు వసూలు చేయబడతాయని వ్యాపిస్తున్న పుకార్లు నిజం కాదని,వాటిని నమ్మవద్దని వివరించింది.

Also Read: అద్భుతమైన ఫీచర్లు ఉన్నా... 2020 లో అమ్ముడు పోని ఫోన్లు ఇవే!Also Read: అద్భుతమైన ఫీచర్లు ఉన్నా... 2020 లో అమ్ముడు పోని ఫోన్లు ఇవే!

ఇలాంటి  సమాచారాన్ని నమ్మవద్దు

ఇలాంటి సమాచారాన్ని నమ్మవద్దు

యుపిఐ లావాదేవీలకు అదనపు ఛార్జీలు లేవని NPCI స్పష్టం చేస్తూ. మీడియాలలో వచ్చే ఇటువంటి కథలను నమ్మవద్దని, మీరు ఈ కొత్త సంవత్సరం లో కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా యుపిఐ లావాదేవీలు నిర్వహించాలని NPCI వినియోగదారులందరినీ కోరింది.

అదనపు ఛార్జీ లేదు
 

అదనపు ఛార్జీ లేదు

కొన్ని మాధ్యమాలలో వ్యాపిస్తున్నపుకార్ల ప్రకారం 2021 జనవరి 1 నుండి యుపిఐ లావాదేవీల పై డబ్బులు వసూలు చేయబడతాయని నివేదించబడింది. అయితే ఈ యుపిఐ లావాదేవీలకు నూతన సంవత్సరం నుండి అదనంగా వసూలు చేయబడుతుందనే నివేదికలు తప్పు అని ఇలాంటి సమాచారాన్ని తాము అధికారికంగా ఎటువంటి రూపంలో విడుదల చేయలేదని NPCI స్పష్టం చేసింది.

మునుపటి లాగే లావాదేవీ ఉచితంగా చేయవచ్చు

మునుపటి లాగే లావాదేవీ ఉచితంగా చేయవచ్చు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)  వినియోగదారుల ను హెచ్చరిస్తూ, అలాంటి పుకార్లకు మరియు ఫేక్ సమాచారానికి బలైపోవద్దని సూచించింది.ఒక వేళ మీరు ఎటువంటి పరిస్థితులలో అయినా అటువంటి సమాచారాన్ని పొందితే మొదట సంబంధిత అధికారిక వెబ్సైటు కానీ ఇతర మాధ్యమం ద్వారా ద్రువీకరించు కోవాలని సూచించింది. ఎప్పటి లాగే అనియంత్రిత మీరు లావాదేవీలు నిర్వహించాలని NPCI కోరింది. UPI  వినియోగదారులందరూ యుపిఐ లావాదేవీలను మునుపటిలా కొనసాగించవచ్చని NPCI నిర్ధారించింది. యూపీఐ నగదు లావాదేవీలను వినియోగదారులు ఉచితంగా చేయడాన్ని కూడా కొనసాగించవచ్చని వెల్లడించారు.

Source: Livemint

Best Mobiles in India

Read more about:
English summary
NPCI Gives Clarity On Rumours About UPI Transactions Being Charged From 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X