NRI UPI పైసా ఖర్చు లేకుండా లక్ష రూపాయలకు వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు.. వారికి చాలా ఉపయోగం..!
భారత్ దేశంలో డిజిటల్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. UPI అందుబాటులోకి వచ్చాక మరింత మరింత అధికమయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. అయితే తాజాగా కీలక ముందడుగు వేసింది. NRI లు కూడా UPI ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. అది కూడా ఉచితంగానే తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. పూర్తి వివరాలు.
ఈ బ్యాంకు ఖాతాలు తప్పనిసరి : NRE (నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) లేదా NRO (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) అకౌంట్‌లను NRI లు కలిగి ఉండాలి. దీంతోపాటు అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను UPI ఐడీలతో లింక్ చేసి ఉండాలి. ఈ పద్ధతిలో విదేశాల నుంచి పూర్తి ఉచితంగా భారత్‌లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు నగదు బదిలీ చేయవచ్చు.

ఈ దేశాల్లో సేవలు : అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనెడా, UK, UAE, ఫ్రాన్స్, ఖతర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, ఒమన్, మలేషియా దేశాల్లోని NRI లు ఈ విధానం ద్వారా ఉచితంగా నగదును బదిలీ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ - iMobile, ఫెడరల్ బ్యాంక్ - Febmobile, ఫోన్ పే, BHIM, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (BHIM AU), సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంకులకు చెందిన UPI యాప్‌లు సపోర్టు చేస్తాయి.
ఏయే బ్యాంకులు సపోర్టు చేస్తాయి : వీటితోపాటు యాక్సెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, DBS బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను సపోర్టు చేస్తాయి.
తొలి 24 గంటల్లో : NRIలు తమ UPI ద్వారా రోజుకు గరిష్ఠంగా లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే వివిధ బ్యాంకులో ఈ నగదు బదిలీ పరిమితి వేర్వేరుగా ఉంటుంది. అయితే కొత్తగా UPI ఐడీ క్రియేట్ చేసుకున్న 24 గంటల్లో కేవలం రూ.5000 మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుంటుంది.
ఎక్కువ బ్యాంకు అకౌంట్‌లు కలిగి ఉన్న NRI లు.. వేర్వేరు UPI ఐడీలను కలిగి ఉంటారు. దీంతోపాటు జాయింట్ అకౌంట్‌లు కలిగి ఉన్న NRI లలో ఒకరు మాత్రమే UPI ఐడీని పొందుతారు. UPI ద్వారా నగదు బదిలీ చేసేందుకు తొలుత తమ NRE లేదా NRE బ్యాంకు ఖాతాలను అంతర్జాతీయ మొబైల్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పూర్తయిన అనంతరం UPI యాక్టివేట్ అవుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








