బ్యాంకు మారినా పాత అకౌంటే..!

Posted By:

బ్యాంకు మారినా పాత అకౌంటే..!

 

న్యూఢిల్లీ: బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌ను కొనసాగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం మొబైల్ పోర్టబిలిటీ, భీమా పోర్టబిలిటీ అందుబాటులోకి తీసుకు వచ్చిన ఆర్దిక శాఖ ఇప్పడు పోర్టబిలిటీ సదుపాయాన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు విస్తరించనుంది. వాణిజ్య బ్యాంకుల్లో పొదుపు ఖాతాల నెంబరు పోర్టబులిటీ సాధ్యా సాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. దీని సాయంతో బ్యాంకు నుంచి వేరొక బ్యాంకుకు ఖాతాలను మార్చుకున్నప్పటికీ వినియోగదారుడు ఒకే ఖాతా నెంబరు కలిగి ఉండే వెసులుబాటు లభిస్తుందని ఆర్ధిక శాఖ అభిప్రాయపడింది.

ఈవిధానం అమలు చేయడానికిగాను బ్యాంకులన్నీ గుర్తింపు కోడ్‌(ఐడెంటిఫికేషన్‌ కోడ్‌) మీద దృష్టి సారించాలన్నారు. ఖాతాదారుల వివరాలను (కెవైసి) కీలక బ్యాంకింగ్‌ పరిష్కారం(సిబిఎస్‌)లను బ్యాంకులు సమకూర్చుకోగలిగితే ఖాతా నెంబరు పోర్టబులిటీ అమలు సాధ్యమవుతుందన్నారు. ఒక సారి నెంబరు పోర్టబులిటీ ప్రక్రియ ద్వారా ఖాతా నెంబరును పొందిన వినియోగదారుడు తన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి వేరే బ్యాంకుకు ఖాతాను మార్చుకున్నప్పటికీ మరలా వ్యక్తిగత వివరాల కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఉండదన్నారు.

బడ్జెట్‌లో ప్రకటించినట్లు ప్రభుత్వరంగ బ్యాంకులకు కావల్సిన మూలధనాన్ని మార్చిలోగా కేటాయిస్తామన్నారు. గత బడ్జెట్‌లో మూలధన కేటాయింపుల కోసం రూ.6,000 కోట్లను ఆర్థిక మంత్రి ప్రణబ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting