గేమర్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. 2025లో ఎన్విడియా GeForce Now లాంచ్.. 4K గేమింగ్ షురూ..!
భారతదేశ గేమర్లకు గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్విడియా GeForce Now క్లౌడ్ గేమింగ్ సర్వీస్ చివరకు మన దేశంలోకి అడుగుపెట్టబోతోంది. 2025 ప్రథమార్ధంలోనే దీనికి సంబంధించిన డేటా సెంటర్ ఇండియాలో ప్రారంభం కానుందని Nvidia అధికారికంగా ప్రకటించింది.
దీంతో, గేమింగ్ ప్రియులు ఇకపై విదేశీ సర్వర్లపై ఆధారపడకుండా, ఎలాంటి VPNలు వాడకుండా నేరుగా GeForce Now సేవలను పొందవచ్చు. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయ గేమర్లకు ఇది నిజంగా గొప్ప శుభవార్త.

2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన ఈ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్, తొలుత కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఆ తర్వాత విస్తరిస్తూ పోయినా, దురదృష్టవశాత్తు మన దేశం మాత్రం ఆ జాబితాలో లేదు. కానీ, CES 2025 వేదికగా ఎన్విడియా చేసిన ప్రకటనతో ఆ నిరీక్షణకు తెరపడనుంది.
"వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియన్ గేమింగ్ మార్కెట్‌లో GeForce RTX-శక్తితో కూడిన గేమింగ్, లేటెస్ట్ హార్డ్‌వేర్ లేకపోయినా AAA గేమ్స్‌ను స్ట్రీమ్ చేసుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది," అని Nvidia తన ప్రకటనలో పేర్కొంది.
అంటే, ఖరీదైన గ్రాఫిక్స్ కార్డులు కొనలేని గేమర్లు కూడా బెస్ట్ క్వాలిటీతో గేమ్స్‌ను ఆడుకోవచ్చు. అంతేకాదు, CESలో ప్రకటించిన సరికొత్త గేమ్స్‌తో పాటు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అల్టిమేట్ మెంబర్‌షిప్ కూడా మన దేశంలో అందుబాటులోకి రానుంది.
* ఎన్విడియా బ్లాగ్‌లో స్పష్టం
"NVIDIA భారత్, లాటిన్ అమెరికాలో క్లౌడ్ గేమింగ్‌ను విస్తరిస్తోంది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఇండియాలో మొదటి GeForce RTX 4080-శక్తితో కూడిన డేటా సెంటర్ ప్రారంభమవుతుంది." అని బ్లాగ్ పోస్ట్ స్పష్టం చేసింది.
భారత్‌తో పాటు, కొలంబియా, చిలీ, థాయ్‌లాండ్, పెరూ దేశాలలో కూడా GeForce Now తన పార్ట్‌నర్స్ ద్వారా సేవలు అందించనుంది. ఈ డేటా సెంటర్‌లో అత్యాధునిక RTX 4080 గ్రాఫిక్స్ కార్డులు ఉండటంతో, గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉండటంతో పాటు, లేటెన్సీ సమస్యలు కూడా ఉండవని భావించవచ్చు.
* ధరలు
ప్రస్తుతం మన దేశానికి సంబంధించిన ధరలు వెల్లడి కాలేదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా Nvidia ఉచితంగా ఒక గంట పాటు 1080p రిజల్యూషన్‌తో ఆడేందుకు వీలు కల్పించే యాడ్-సపోర్టెడ్ టైర్‌ను అందిస్తోంది. ఇక పెర్ఫార్మన్స్ టైర్ 1440p రిజల్యూషన్, 60fps స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.
టాప్-టైర్ అయిన GeForce Now అల్టిమేట్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, DLSS 3, రే ట్రేసింగ్, ఎక్కువ సేపు ఆడే అవకాశం, 4K గేమింగ్, 240 FPS వరకు స్ట్రీమింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అంతేకాదు, తక్కువ వెయిటింగ్ టైమ్‌తో పాటు, నెలకు 100 గంటల ప్లేటైమ్, ఒక సెషన్‌లో గరిష్టంగా 8 గంటల వరకు ఆడే అవకాశం ఉంటుంది.
* మరో గుడ్ న్యూస్
GeForce Now త్వరలో స్టీమ్ డెక్‌లో సైతం అందుబాటులోకి రానుంది. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా 4K 60FPS, HDRతో గేమ్స్‌ను ఆడవచ్చు. GeForce Now గేమ్స్ స్ట్రీమ్ చేయబడతాయి కాబట్టి, స్టీమ్ డెక్ తక్కువ ప్రాసెసింగ్ పవర్‌ను ఉపయోగిస్తుంది, తద్వారా బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుందని Nvidia చెబుతోంది.


Click it and Unblock the Notifications








