జపాన్‌ని వణికిస్తున్న వెండి చేప, ఏకంగా భూకంపాన్నే తీసుకొస్తోంది

ఈ న్యూస్ విన్నవారెవరైనా షాక్ కు గురి అవడం ఖాయం. ఓ చనిపోయిన చేప అందాల జపాన్ ను వణికిస్తోంది.

|

ఈ న్యూస్ విన్నవారెవరైనా షాక్ కు గురి అవడం ఖాయం. ఓ చనిపోయిన చేప అందాల జపాన్ ను వణికిస్తోంది. మొత్తం 11 మీటర్లుండే ఆ చేప యావత్ జపాన్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.వారం రోజుల్లో మూడు చేపలు సముద్ర గర్భం నుండి తీరానికి కొట్టుకురావడంతో జపాన్ ప్రజల్లో ప్రాణభయం మరింత తీవ్రమై వణికిపోతున్నారు. ఈ సారి భూకంపం విధ్వంసం సృష్టిస్తుందని అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియదని బిక్కుబిక్కుమంటున్నారు. జపాన్ దేశాన్ని సునామీ ముంచెత్తుందన్న భయంతో అక్కడి ప్రజలు ప్రాణాలరచేత పట్టుకొని జీవిస్తున్నారు. స్టోరి పూర్తి లోపలకు వెళితే..

 

మీ మొబైల్ లో ఈ యాప్స్ ఉన్నాయా వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండిమీ మొబైల్ లో ఈ యాప్స్ ఉన్నాయా వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి

ఓర్‌ఫిష్

ఓర్‌ఫిష్

పైన ఫొటోలో కనిపిస్తున్న చేపను చూశారా.. దీనిపేరు ఓర్‌ఫిష్. సముద్ర పాము, రైగు నో సుకాయ్ అన్న పేరు కూడా దీనికి ఉంది. ఇప్పుడీ చేపలను చూసి జపాన్ వణికిపోతోంది. మరోసారి తమ దేశాన్ని భూకంపాలు, సునామీ ఎక్కడ ముంచెత్తుతుందో అన్న ఆందోళన వాళ్లలో కనిపిస్తున్నది.

సముద్ర గర్భంలో

సముద్ర గర్భంలో

పాములాగా ఎన్నో అడుగుల పొడువు ఉండే ఈ చేపలు సముద్ర గర్భంలో 200 మీటర్ల నుంచి కిలోమీటర్ లోతున ఉంటాయి. ఇవి తీరానికి కొట్టుకు వచ్చినా లేక మత్స్యకారుల వలలకు చిక్కినా సముద్ర గర్భంలో భూకంపం వచ్చిందని జపనీయులు భావిస్తారు.

తొయామా సముద్ర తీరంలో..
 

తొయామా సముద్ర తీరంలో..

ఈ వారం మొదట్లో 3.2 మీటర్ల పొడవున్న ఓర్‌ఫిష్‌ తొయామా సముద్ర తీరంలో కనిపించగా, మరో నాలుగు మీటర్లున్న చేప ఇముజు నౌకాశ్రయంలో ఏర్పాటు చేసిన వలల్లో చిక్కుకుంది. సాధారణంగా ఈ చేపలు సముద్ర అడుగుభాగాన 200 నుంచి 1000 మీటర్ల లోతులో జీవిస్తుంటాయి. వీటికి వెండి రంగుతో కూడిన చర్మం, ఎర్రని రెక్కలు ఉంటాయి.

 

 

మొత్తం ఓర్‌ఫిష్‌ల సంఖ్య

మొత్తం ఓర్‌ఫిష్‌ల సంఖ్య

దీంతో ఈ సీజన్‌లో కనిపించిన మొత్తం ఓర్‌ఫిష్‌ల సంఖ్య ఏడుకి చేరింది. ఆ తర్వాత 13 అడుగుల పొడువున్న మరో ఓర్‌ఫిష్ మత్య్సకారుల వలకు చిక్కింది. దీనిని సముద్ర దేవుడి నుంచి వచ్చిన దూతగా జపాన్ ప్రజలు భావిస్తారు. ఇవి సముద్రపు దేవుడి నుంచి సమాచారం తీసుకొస్తాయని అక్కడి పురాణాలు చెబుతాయి.

తీరానికి వచ్చాయంటే

తీరానికి వచ్చాయంటే

గతంలో 10.5 అడుగుల పొడువున్న ఓర్‌ఫిష్ తొయామా తీరానికి కొట్టుకొని వచ్చింది. ఇవి తీరానికి వచ్చాయంటే ఏ విపత్తు సంభవించబోతున్నదని అక్కడి ప్రజలు భయపడతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారం అయితే ఏదీ లేదు. కానీ వంద శాతం ప్రకృతి విపత్త సంభవించదు అని కూడా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.

ఎటువంటి శాస్త్రీయ పరమైన రుజువులు లేవు

ఎటువంటి శాస్త్రీయ పరమైన రుజువులు లేవు

భూకంపాలు ఏర్పడే ముందు అవి ఒడ్డుకు వస్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ పరమైన రుజువులు లేవు. కానీ అవి రావనిచెప్పే అవకాశాలు 100 శాతం లేవని మనం చెప్పలేమని ఔజు యాక్వేరియంలో పనిచేసే కజుసా సాయిబా అన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగానే ఆ చేపలు సముద్ర ఉపరితలంపైకి వస్తూ ఉండొచ్చని పేర్కొన్నారు

ఫుకుషిమా భూకంపం

ఫుకుషిమా భూకంపం

2010లో సుమారు 10 ఓర్‌ఫిష్‌లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైంది.

అలాంటి పరిస్థితులే

అలాంటి పరిస్థితులే

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భావిస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు. సునామీ పరిస్థితులు ఆ చేపలకు ముందే తెలుస్తుందన్న ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Is doomsday near? Sightings of rare Oarfish in Eastern Japan triggers fear of imminent earthquake More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X