ఇండియాలో శుక్రవారం నుండి హాల్‌చల్ చేయనున్న ఆపిల్ ఐప్యాడ్2

Posted By: Staff

ఇండియాలో శుక్రవారం నుండి హాల్‌చల్ చేయనున్న ఆపిల్ ఐప్యాడ్2

న్యూఢిల్లీ: ఎట్టకేలకు చివరకు టెక్నాలజీ గెయింట్ ఆపిల్ తన యొక్క ఐకానిక్ డివైస్ ఐప్యాడ్2ని ఇండియాలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈవిషయాన్ని ఆపిల్ కంపెనీ ప్రతినిధులు స్వయంగా వెల్లడించారు. ఇండియన్ మార్కెట్‌లలో ఆపిల్ ఐప్యాడ్2 ఏప్రిల్ 29 అంటే శుక్రవారం నుండి లభించనుంది. మొట్టమొదటి వర్సన్ విడుదలైన సంవత్సరం తర్వాత రెండవ వర్సన్ విడుదల చేసిన ఆపిల్ ఐప్యాడ్ కంపెనీ, ఐప్యాడ్2ని మాత్రం ఇంటర్నేషనల్‌గా విడుదల చేసిన నెలరోజులకే ఇండియాలో విడుదల చేయడం విశేషం.

చూడడానికి చాలా అందంగా ఉన్నటువంటి ఐప్యాడ్2 ఇండియన్ మార్కెట్‌లో ఓ సరిక్రొత్త చరిత్రను సృష్టిస్తుంది అనడంలో సందేహాం లేదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ అయిన శ్యామ్ సంగ్ గెలాక్సీ, డెల్ స్ట్రీక్‌ను ఆపిల్ ఐప్యాడ్2 నియంత్రిస్తుందని అంటున్నారు. శుక్రవారం నుండి ఇండియాలోని ప్రధాన నగరాలలో ఐప్యాడ్2 ఆకర్షణీయమైన ధరలో లభించనుంది.

ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే 16జిబి వై-పై మోడల్ ధర రూ 29,500 ఉండగా, అదే 32జిబి వై-పై మోడల్ ధర రూ 34,500 ఉండగా, 64జిబి మోడల్ ధర కేవలం రూ 39,500గా ఉన్నాయి. ఇక 3జి మోడల్స్ చూస్తే ఇంకొంచెం ధర ఎక్కువుగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్బంలో ఆపిల్ కంపెనీ సిఈవో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ ఐప్యాడ్2లో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరిగిందన్నారు. మార్చి 3వ తారీఖున ఆపిల్ ఐప్యాడ్2ని శ్యాన్ ప్రాన్సికోలో విడుదల చేయడం జరుగుతుందన్నారు.

Apple iPad 2 Specifications & Features:

* 9.7-inch LED-backlit LCD screen (1024x768 pixel resolution)
* Multi-Touch display with IPS technology
* Fingerprint-resistant oleophobic coating
* 1GHz dual-core Apple A5 processor
* Dual Cameras
* Rear camera -HD (720p) video recording & still camera with 5x digital zoom
* Front VGA Camera - FaceTime & Photo Booth support
* Bluetooth 2.1 + EDR technology
* Wi-Fi (802.11a/b/g/n)
* 30-pin dock connector port
* 3.5-mm stereo headphone minijack
* Built-in speaker
* Microphone
* HDMI mirrored video output
* Up to 10 hours of battery life

Apple iPad 2 Price in India:

* iPad 2 (16 GB model) - Rs 29,500
* iPad 2 (32 GB model) - Rs 34,500
* iPad 2 (64 GB model) - Rs 39,500
* iPad 2 Wi-Fi + 3G (16 GB model) - Rs 36,900
* iPad 2 Wi-Fi + 3G (32 GB model) - Rs 41,900
* iPad 2 Wi-Fi + 3G (64 GB model) - Rs 46,900

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot