ఇండియాలో మొబైల్ యూజర్స్ 500mn మాత్రమే, 800mn కాదు

Posted By: Super

ఇండియాలో మొబైల్ యూజర్స్ 500mn మాత్రమే, 800mn కాదు

ఇండియాలో ఉన్నటువంటి మొబైల్ యూజర్స్ మొత్తం ఎంతమంది అంటే మొన్న మార్చి2011వ సంవత్సరానికి గాను దాదాపు 811.59 మిలియన్స్ అని అన్నారు. కానీ ఇప్పుడు అది అంతా అబద్దం అని అంటున్నారు. ఇండియా టెలికామ్ రెగ్యులేటరీ ట్రాయ్ మరియు ఇండస్ట్రీ స్టాటస్టిక్స్ లెక్కల ప్రకారం ఇండియాలో మొబైల్ వాడే వారి సంఖ్య కేవలం 500మిలియన్ మందేనని అధికారకంగా వెల్లిడించడం జరిగింది.

పైన చెప్పినటువంటి నెంబర్ కేవలం ట్రాయ్ రిపోర్ట్ ప్రకారమే వెల్లడించడమైంది. ఫిబ్రవరి 2011నాటికి ఇండియాలో ఉన్న సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య ఇది. కానీ మార్చిలో ఇండియా మొత్తం మీద దాదాపు 811.59 మిలియన్స్ మంది సెల్ పోన్స్ వాడుతున్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో అస్సలు ఒరిజినల్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీ జర్నల్ అసలు సంఖ్యను వెలికి తీసింది.

ఫిబ్రవరి 2011నాటికి వైర్ లెస్ సబ్‌స్క్రైబర్స్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య కేవలం 563మిలియన్స్ మాత్రమే. ఐతే మిగిలినటువంటి 228 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ వాడుతున్నటువంటి జనాభా మాత్రం వారి యొక్క కనెక్షన్‌ని ఎక్కువ రోజులు కోనసాగించలేకపోతున్నారు. ఎవరైతే రెండు సిమ్ కార్డులు తీసుకోని ఒకటి వాడుతూ, ఇంకొకటి వాడకుండా ఉన్నాకానీ.....ట్రాయ్ లెక్క ప్రకారం రెండు సబ్‌స్క్రైబర్స్ వాడుతున్నట్లు డేటాలో తెలుస్తుంది.

ఈ విషయంపై గతంలో మాజీ ఛీప్ మార్కెటింగ్ డైరెక్టర్ టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్ బియస్‌ఎన్‌ఎల్ కులదీప్ గోయల్ మాట్లాడుతూ 800 మిలియన్ సబ్‌స్క్ర్రిప్సన్ అర్దంలేదని కానీ 800మిలియన్ యూజర్స్ ఉంటారు. కానీ అందులో మొత్తం 450 నుండి 500మిలియన్స్ వరకు యాక్టివ్ యూజర్స్ ఉండోచ్చునని తన అభిప్రాయాన్ని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot