బెంగుళూరు ఫ్యాన్స్ కోసం!!

Posted By: Super

బెంగుళూరు ఫ్యాన్స్ కోసం!!

 

ప్రపంచాన్ని ఐపీఎల్ ఫీవర్ కుదిపేస్తుంది. అంచనాలకు భిన్నంగా.. మరింత ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్‌ల పరంపరం కొనసాగుతోంది. మన క్రికెటర్ల దూకుడుకు.. విదేశీ ఆటగాళ్ల అండ తోడవటంతో ఐపీఎల్ -5ను అభిమానులు రెట్టించిన ఉత్సకతతో ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా అభిమాన జట్లకు తమ తమ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ పీసీల ద్వారా సంబంధిత అప్లికేషన్ సాయంతో మద్దతు పలుకుతున్నారు.

సిక్సర్ల సునామీ గెయిల్.. యంగ్ తరంగ్ కోహ్లీ వంటి విరోచిత ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న బెంగుళూరు రాయల్ ఛాలెంజర్ప్ జట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఫ్యాన్స్ కోసం ఆఫీషియల్ ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) అప్లికేషన్‌ను లాంఛ్ చేసింది. ఔత్సాహికులు గుగూల్ ప్లే స్టోర్‌లోకి లాగినై ఉచితంగా ఆర్‌సీబీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యతతో ప్రత్యక్ష స్కోర్, జట్టు సమాచారం, తాజా వీడియోలు,

ఫేస్‌బుక్ అప్‌డేట్స్, ఆటగాళ్లు చేసిన ట్వీట్‌లను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ అభిప్రాయాలను పోస్ట్ చేసే వీలును కూడా కల్పించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot