ఆ 40 సెకండ్ల వీడియోని చూస్తే ఓ మైగాడ్ అనాల్సిందే

కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది.

|

కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో 'ఎయిరో ఇండియా-2019’ షో కోసం చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 23న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిరో ఇండియా ప్ర‌ద‌ర్శ‌న కోసం పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తున్నారు. రిహార్స‌ల్స్ చేస్తుండ‌గా సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. రెండు జెట్ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకొని భారీ శబ్దంతో కుప్పకూలిపోయాయి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘ‌ట‌న స‌మ‌యంలో ముగ్గురు పైల‌ట్లు జెట్ విమానాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది.

ఫోన్ ఇలా పట్టుకుంటే మీ జాతకం చెప్పేస్తుందిఫోన్ ఇలా పట్టుకుంటే మీ జాతకం చెప్పేస్తుంది

వీడియో పుటేజి

వీడియో పుటేజి

దీనికి సంబంధించిన 40 సెకన్ల వీడియో బయటకు వచ్చింది. కాగా ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలను న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్‌ఐ' ట్వీట్ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కిందకి దూకేయడంతో

కిందకి దూకేయడంతో

ప్రమాదం నుంచి పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్టు ముందే కిందకి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన పైలట్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా

ప్రత్యేక ఆకర్షణగా

ఫిబ్రవరి 24 వరకు నిర్వహించే ఈ ఎయిర్‌షోలో వివిధ యుద్ధ విమానాలు, పైలట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది..

సాహిల్‌ గాంధీ అనే పైలట్‌

సాహిల్‌ గాంధీ అనే పైలట్‌

కాగా ఈ ఘటనలో సాహిల్‌ గాంధీ అనే పైలట్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే మరో విమానంలో బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు.

జెట్‌ విమానాల శిథిలాలు

జెట్‌ విమానాల శిథిలాలు

రెండు విమానాలు యలహంక ఎయిర్‌బేస్‌ సమీపంలోని ఘంటిగా నహళ్లి గ్రామంలో పడ్డాయి. జెట్‌ విమానాల శిథిలాలు అదృష్టవశాత్తు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో పడటంతో అక్కడి స్థానికులెవరూ గాయపడలేదు.

Best Mobiles in India

English summary
Oh my god’: Video shows last 40 seconds of Surya Kiran crash in Bengaluru More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X