Uber, Ola క్యాబ్ సేవలు తిరిగి మొదలయినాయి.... కాకపోతే??

|

ఇండియాలో COVID-19 ను నివారించడానికి మర్చి 14 నుండి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్ అగ్రిగేటర్ సేవలు కూడా నిలిపివేయబడినాయి. క్యాబ్ యొక్క సేవలను అద్భుతంగా అందిస్తున్న ఉబెర్ మరియు ఓలా సంస్థలు ఇప్పుడు పాక్షికంగా వాటి యొక్క సేవలను ఇండియాలో తిరిగి ప్రారంభించాయి.

ఉబెర్ మరియు ఓలా

భారత ప్రభుత్వం మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను సడలించిన తరువాత ఉబెర్ మరియు ఓలా సంస్థలు తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ఈ జోన్లలో ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్లను తిరిగి పని చేయడానికి అనుమతిస్తుంది. అయితే క్యాబ్ అగ్రిగేటర్ సేవలు ఇప్పటికీ రెడ్ జోన్లలో లేదా నియమించబడిన కంటైనర్ జోన్లలో అనుమతించబడవు.

 

 

Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్...Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్...

ప్రభుత్వ నిబంధనలు
 

ప్రభుత్వ నిబంధనలు

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో ఉబెర్ యొక్క సేవలు తిరిగి ప్రారంభించబడ్డాయి అని అధికారిక ప్రకటన వచ్చింది. కటక్, డామన్, గౌహతి, జంషెడ్పూర్, సిల్వాస్సా, కొచ్చి, మరియు త్రిస్సూర్ వంటి గ్రీన్ జోన్లలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాము అను సంస్థ యొక్క ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలలో ప్రతి వాహనానికి ఇద్దరు ప్రయాణీకుల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చోవద్దని కూడా కంపెనీ సిఫారసు చేస్తుంది.

 

 

 

JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్ లకు పోటీగా...JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్ లకు పోటీగా...

ఉబెర్ సర్వీస్

ఉబెర్ సర్వీస్

ఆరెంజ్ జోన్లలో రైడర్స్ ప్రతి వాహనానికి గరిష్టంగా ఇద్దరు ప్రయాణీకులతో పాటుగా స్థానిక నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. అలాగే ఎటువంటి పరిస్థితులలోను డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చోవడానికి అనుమతి లేదు. సేవలను తిరిగి ప్రారంభించిన నగరాల్లో అమృత్సర్, అసన్సోల్, దుర్గాపూర్, ఘజియాబాద్, గురుగ్రామ్, హుబ్లి, కోజికోడ్, మంగుళూరు, మెహసానా, మొహాలి, నాడియాడ్, పంచకుల, ప్రయాగ్రాజ్, రోహ్తక్, తిరువనంతపురం, ఉదయపూర్, వడైపూర్, వడైమూర్ వంటి నగరాలు ఉన్నాయి.

రెడ్ జోన్ల వివరాలు

రెడ్ జోన్ల వివరాలు

ముంబై, డిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోనగరాలు ప్రస్తుతం రెడ్ జోన్లలో ఉన్నందు వలన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు క్యాబ్ అగ్రిగేటర్ సేవలు అందుబాటులో లేవు. ఉబెర్ ఇప్పటికి ఈ జోన్లలో ఉబెర్ ఎసెన్షియల్ మరియు ఉబెర్ మెడిక్ సేవలను అందిస్తూనే ఉంది. ఉబెర్ సంస్థ ఇండియాలో లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ నగరాలలో ఈ సేవలను అందిస్తోంది.

ఓలా సర్వీస్

ఓలా సర్వీస్

ఇండియా అంతటా 100 కి పైగా నగరాల్లో గల గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో తమ సేవలను తిరిగి ప్రారంభించవలసిందిగా ఓలా సంస్థ తమ డ్రైవర్లకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. ఫేస్ మాస్క్‌లు ధరించడం, ఎయిర్ కండీషనర్ స్విచ్ ఆఫ్ ఉంచడం మరియు రైడర్ మరియు డ్రైవర్ ఇద్దరు సౌకర్యవంతమైన మాస్క్ లను ధరించాలి. అలాగే కస్టమర్లు మరియు డ్రైవర్లు అనుసరించవలసిన మరిన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. లాక్డౌన్ వ్యవధిలో అవసరమైన కార్మికులు మరియు వైద్య సిబ్బందిని తరలించడానికి స్థానిక ప్రభుత్వాలకు సహాయం చేయడానికి సంస్థ తమ పరిమిత సేవలను నడుపుతోంది.

యాప్ -ఆధారిత క్యాబ్‌

యాప్ -ఆధారిత క్యాబ్‌

రోజులో ఉదయం 7AM నుంచి సాయంత్రం 7PM మధ్య పూర్తి కర్ఫ్యూతో యాప్ -ఆధారిత క్యాబ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఇతర నిబంధనలు పాటించాలని ప్రభుత్వం దేశ పౌరులకు సూచించింది. అలాగే సీనియర్ పౌరులు మరియు పిల్లలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని కూడా తెలిపింది. వీలైనంత వరకు 10 సంవత్సరాల పిల్లలను ప్రయాణాలకు దూరంగా ఉంచాలని కూడా సూచించారు.

Best Mobiles in India

English summary
Ola and Uber Resumes Services in Green and Orange Zones in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X