ఏపీ, తెలంగాణా వాసులకు తియ్యని శుభవార్తను అందించిన ఓలా

|

ఇప్పటి వరకు సీటీకే పరిమితమైన ఓలా సేవలు ఇకపై హైదరాబాద్‌ నుంచి ఎక్కడికైనా సరే పరుగుకు సిద్ధమంటున్నాయి.వీకెంట్ టూర్ కోసం ఎక్కడికైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ఓత్సాహికులకు ఓలా సరికొత్తగా సేవలను అందించనుంది. 'అవుట్‌ స్టేషన్‌ సర్వీస్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకు, పర్యాటక ప్రాంతాలకు ఓలా తమ సేవలను అందిచనుంది. కాగా బుక్‌ చేసిన గంటలోగా ఇంటికి వచ్చేస్తుంది. ప్రస్తుత వేసవి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సుమారు 10 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు అవుట్‌ స్టేషన్‌ క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

 

షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?

మరో 600 నగరాలకు ..

మరో 600 నగరాలకు ..

దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాలు, జిల్లా కేంద్రాలకు క్యాబ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఓలా మరో 600 నగరాలకు వన్‌వే ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఏలూరు, చిత్తూరు, కడప, వరంగల్, శ్రీశైలం తదితర ప్రధాన కేంద్రాలకు వన్‌వే ట్రిప్పులను, వీకెండ్‌ క్యాబ్‌ సర్వీసులను ప్రవేశపెట్టింది.

అవుట్‌ స్టేషన్‌ సర్వీసు

అవుట్‌ స్టేషన్‌ సర్వీసు

ఓలా యాప్‌ నుంచే ఈ అవుట్‌ స్టేషన్‌ సర్వీసులను బుక్‌ చేసుకోవచ్చు. ‘అవుట్‌ స్టేషన్‌' ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే అన్ని వివరాలు మొబైల్‌ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలనే అంశాన్ని ఎంపిక చేసుకొంటే అందుకు చెల్లించవలసిన చార్జీలు కూడా తెలిసిపోతాయి.

బుక్‌ చేసుకున్న గంట వ్యవధిలోనే..
 

బుక్‌ చేసుకున్న గంట వ్యవధిలోనే..

క్యాబ్‌ బుక్‌ చేసుకున్న గంట వ్యవధిలోనే క్యాబ్‌ ఇంటికి ముందుకు వచ్చి వాలుతుంది. అంతేకాదు 7 రోజుల ముందే బుక్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య, కావలసిన సదుపాయాలకు అనుగుణంగా మీరు సెడాన్, ఎస్‌యూవీ, లగ్జరీ వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు.

 మీరు బుక్ చేసుకునే వాహనాన్ని..

మీరు బుక్ చేసుకునే వాహనాన్ని..

అయితే మీరు బుక్ చేసుకునే వాహనాన్ని బట్టి చార్జీలు విడిగా ఉంటాయి. చార్జీల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవల నిర్వహణ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.వన్‌వే ట్రిప్పులతో పాటు, 12 గంటల ట్రిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి.

వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని..

వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని..

అవుట్‌ స్టేషన్‌ సర్వీసులను గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాలకు వాటిని విస్తరించడంతో డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది. పూర్తి ఏసీ సదుపాయంతో, వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని ఓలా అందజేస్తోంది.

అన్ని భద్రతా సదుపాయాలు..

అన్ని భద్రతా సదుపాయాలు..

ఓలా యాప్‌ నుంచి బుక్‌ చేసుకొనే అవుట్‌ స్టేషన్‌ సర్వీసుల్లో అన్ని భద్రతా సదుపాయాలు ఉన్నాయని ఓలా తెలిపింది. డ్రైవర్‌ అనుభవం, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనం వివరాలతో పాటు ఏ క్షణంలోనైనా రక్షణ కోరేందుకు ప్యానిక్‌ బటన్‌ సైతం ఏర్పాటు చేశారు.

జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల..

జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల..

ఇంకా జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల అవుట్‌ స్టేషన్‌ క్యాబ్‌ల్లో కూడా వెహికల్‌ ట్రాకింగ్‌ మూవ్‌మెంట్‌ తెలుస్తుంది. 24 గంటలూ భద్రతా సదుపాయం ఉంటుంది. సోమ ఇకపై మీరు ఓలాతో హ్యాపీగా గమ్యాన్ని చేరవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
After capturing the Indian market with their service, the online cab aggregator Ola is out to provide another travel option, Ola Outstation, with which the company hopes to connect over 500 cities in India. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X