Home
News

రైడర్ సేఫ్టీ కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్న OLA

ఈ రోజుల్లో సమయానికి అనుగుణంగా గమ్యాన్ని చేరుకోవడానికి బస్సుల కన్నా క్యాబ్స్ చాల ముఖ్య భూమికను పోషిస్తున్నాయి .

By Anil

ఈ రోజుల్లో సమయానికి అనుగుణంగా గమ్యాన్ని చేరుకోవడానికి బస్సుల కన్నా క్యాబ్స్ చాల ముఖ్య భూమికను పోషిస్తున్నాయి . అయితే ఒక్కోసారి యాప్ లో క్యాబ్ ను బుక్ చేసినప్పుడు యాప్ లో కనిపిస్తున్నాఫోటో లోని వ్యక్తి కాకుండా మరొక వ్యక్తిని గమినిస్తుంటాం.అలా వేరే వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఏమైనా చేస్తాడేమో అని భయబ్రాంతులకు లోనవుతుంటాం. ఈ నేపథ్యం లో ప్రాక్సీ డ్రైవర్ల ఫోటోల సమస్యను పరిష్కరించడానికి, క్యాబ్ డ్రైవర్ల గుర్తింపును ధృవీకరించడానికి సెల్ఫీ ఫోటో ఉపయోగించే ఒక కొత్త ఫీచర్ ను OLA క్యాబ్ సంస్థ పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఇది ఢిల్లీ లో మాత్రమే ఈ సేఫ్టీ ఫీచర్ ను టెస్ట్ చేస్తుంది.త్వరలో అన్ని ప్రధాన నగరాలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది అని OLA కంపెనీ తెలుపుతుంది.

సెల్ఫీ ఆతంటిఫికేషన్ సిస్టమ్  ఎలా పని చేస్తుందంటే.....

సెల్ఫీ ఆతంటిఫికేషన్ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే.....

ఈ సెల్ఫీ ఆతంటిఫికేషన్ సిస్టమ్ చాల సింపుల్ గా పనిచేస్తుంది. క్యాబ్ బుక్ చేసినట్టు డ్రైవర్ కు మెసేజ్ వెళ్ళగానే ఆ సదరు డ్రైవర్ లైవ్ లో ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని యాప్ లో పెట్టాల్సి వస్తుంది.ఒక్కసారి సెల్ఫీ ఫోటో ను తీసుకోగానే అది సిస్టం లో కనిపిస్తుంది. సిస్టమ్ లో ఉన్న ఫోటో ను డ్రైవర్ యొక్క సెల్ఫీ ఫోటో తో సరిపోలుతుందో లేదో సిస్టమ్ తనిఖీ చేస్తుంది. మ్యాచ్ అయితే అద్ది మంచిదే లేకపోతే మీరు సదురు డ్రైవర్ ను ట్యాకిల్ చేసుకోవాల్సి వస్తుంది.

బుక్  చేసిన డ్రైవర్ కాకుండా ప్రాక్సీ  డ్రైవర్ అయితే....

బుక్ చేసిన డ్రైవర్ కాకుండా ప్రాక్సీ డ్రైవర్ అయితే....

ఒక వేళా బుక్ చేసిన డ్రైవర్ కాకుండా ప్రాక్సీ డ్రైవర్ కార్ ను నడిపితే రైట్ డ్రైవర్ ను పిలిచి కంపెనీ డ్రైవర్ ను ప్రశ్నిస్తుంది.కారణాన్ని బట్టి కంపెనీ ఆ డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకుంటుంది.

సురక్షితమైన రైడ్ ను అందించడంలో.....

సురక్షితమైన రైడ్ ను అందించడంలో.....

ముఖ్యంగా ఈ సెల్ఫీ ఆతంటిఫికేషన్ సిస్టమ్ ఒక అల్గోరిథం-ఆధారిత సిస్టమ్ ద్వారా ర్యాండమ్ గా డ్రైవర్ కు అలాగే రైడర్ కు పంపుతుంది. ఇది technological intervention లాగా వ్యవహరిస్తుంది అలాగే ప్రయాణీకులకు సురక్షితమైన రైడ్ ను అందించడంలో సహాయపడుతుంది.

స్ట్రీట్ సేఫ్టీ   క్యాంపెయిన్....

స్ట్రీట్ సేఫ్టీ క్యాంపెయిన్....

OLA భారతదేశంలో స్ట్రీట్ సేఫ్టీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.దీనిని ఢిల్లీ పోలీసు కమిషనర్ Amulya Patnaik ఢిల్లీ లో ప్రారంభించారు . భారతదేశంలో రహదారి మరణాలకు సంబంధించిన మూడు కీలక అంశాలపై అవగాహన కల్పించడంపై కేంద్రీకరించింది . దానితో పాటు డ్రింక్ అండ్ డ్రైవ్, వేగంగా నడపడం అలాగే టెక్సటింగ్ ఫై అవగాహన కల్పిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Ola wants only registered drivers on duty, pilots random selfies authentication for surprise checks.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X