సమస్యల్లో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్ట్

భారతదేశపు ప్రముఖ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ఓలా (Ola), ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్టుకు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది.

|

భారతదేశపు ప్రముఖ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ఓలా (Ola), ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్టుకు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. ఈ కార్లకు సంబంధించిన నిర్వహణా ఖర్చులు పెను భారంగా మారటంతో చాలా మంది ఓలా డ్రైవర్లు వీటిని వెనక్కి ఇచ్చేస్తున్నారు. దీంతో ఇండియన్ ఆటోస్ ఇండస్ట్రీకి అప్‌కమ్మింగ్ రివల్యూషన్‌గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2030 నాటికి అన్ని కొన్ని వాహనాలను ఎలక్ట్రికల్ వెహికల్స్‌గా మార్చాలన్న నరేంద్ర మోదీ ఆశయం కూడా నెరవేరేలా కనిపించటం లేదు. ఓలా ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్టులో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ 8 మిలియన్ డాలర్లు వరకు పెట్టుబడులు పెట్టింది.

ola cab

9 నెలల క్రితం ఈ ప్రాజెక్టును రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు ఆదిలోనే బ్రేకులు పడుతున్నాయి. ఇటీవల నాగ్‌పూర్‌కు చెందిన 20 మంది ఓలా ఎలక్ట్రిక్ కార్ డ్రైవర్లను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసింది. వీరిలో 12 మందికి పైగా డ్రైవర్లు ఎలక్ట్రిక్ కార్లను రిటర్న్ ఇచ్చేసి డీజిల్ కార్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఎక్కువ సేపు వెయిట్ చేయవల్సి రావటం, మెయింటేన్స్ ఖర్చులు ఎక్కువుగా ఉండటం వంటి కారణాలతోనే ఈ కార్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు.

రూ. 399కే షియోమి నుంచి పవర్‌పుల్ ఇయర్ ఫోన్స్రూ. 399కే షియోమి నుంచి పవర్‌పుల్ ఇయర్ ఫోన్స్

పాయింట్లను పొడిగించినప్పటికి ఫలితం లేకుండా పోయింది..

పాయింట్లను పొడిగించినప్పటికి ఫలితం లేకుండా పోయింది..

2.5 మిలియన్ల జనబాను కలిగి ఉన్న నాగ్‌పూర్‌లో తమ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఛార్జ్ చేసుకునేందుకు 50 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు గతంలో తెలిపినప్పటికి 2018 జనవరి నాటికి 12 పాయింట్లనే అక్కడ నెలకొల్పినట్లు రాయిటర్స్ పరిశీలనలో వెల్లడైండి. ఆ తరువాత మరో 10 పాయింట్లను పొడిగించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుండటంతో పాటు నిర్వహణా భారం కూడా పెరిగిపోతుండటంతో వీటిని రిటర్న్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని పై ఓలా అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు.

 

 

 గతకొంత కాలంగా అనేక సమస్యలు..

గతకొంత కాలంగా అనేక సమస్యలు..

భారత్‌లో అత్యుత్తమ క్యాబ్ బుకింగ్ సర్వీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓలా గతకొంత కాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ కార్యాలాయాన్ని కూడా ఓలా మూసివేయాల్సి ఉచ్చింది. ఓలా డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలగిస్తున్నారంటూ స్థానికుల నిరసనలు వ్యక్తం చేయటంతో ఓలా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆ సమస్యను క్లియర్ చేసుకోడానికి ఓలాకు దాదాపు 5 నెలల సమయం పట్టింది.

 పదే పదే హెచ్చరించినప్పటికి..

పదే పదే హెచ్చరించినప్పటికి..

ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణకు భారత్ ఇంకా సిద్ధం కాలేదని ప్రపంచకార్ల తయారీ కంపెనీలు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఓ స్పష్టమైన పాలసీని అనౌన్స్ చేయాలని ఈ సంస్థలు కోరుకుంటున్నాయి.

 అడుగడుగునా అనేక సవాళ్లు..

అడుగడుగునా అనేక సవాళ్లు..

ప్రస్తుతానికి భారత్‌లో మహీంద్రా & మహీంద్రా మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను తయారీ చేస్తోంది. ఈ బ్రాండ్ అందిస్తోన్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ధర రూ.7,60,000గా ఉంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసేవారికి ఈ బడ్జెట్ చాలా ఎక్కువుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో దీనిలోని సగం ధరకే డీజిల్ ఇంకా గ్యాస్ వేరియంట్ కార్లు లభ్యమవుతున్నాయి.

 

 

మహీంద్రాతో ఒప్పందం కుదర్చుకున్న ఓలా...

మహీంద్రాతో ఒప్పందం కుదర్చుకున్న ఓలా...

ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మహేంద్రతో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా ఆ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన కార్లను డ్రైవర్లకు లీజ్ ప్రాతిపదికన ఇస్తోంది. డ్రైవర్ల నుంచి రోజు అద్దె క్రింద రూ.1000ను వసూలు చేస్తోంది. ఛార్జింగ్ నిమిత్తం రోజుకు రూ.500 నుంచి రూ.600 ఖర్చవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వెహికల్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఈ ప్రాసెస్ పెద్ద తొలనొప్పిగా మారటంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను రిటర్న్ చేయటంతో పాటు వాటి స్థానంలో డీజిల్ వాహనాలను తీసుకుంటున్నారు.

Best Mobiles in India

English summary
Indian ride-hailing firm Ola's pilot project to test a fleet of electric vehicles in Nagpur was expected to herald a coming revolution in the Indian autos industry.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X