ఫేస్ యాప్‌తో చాలా డేంజర్, మీ డేటా మొత్తం హ్యాక్ !

By Gizbot Bureau
|

ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్ యాప్ గురించే చర్చ. ఈ యాప్ సాయంతో వృద్ధాప్యంలో తమ ముఖం ఎలా ఉంటుందో చూసుకునే సౌకర్యం ఉండడంతో యువత వేలంవెర్రిగా డౌన్ లోడ్ చేస్తోంది.

ఫేస్ యాప్‌తో చాలా డేంజర్, మీ డేటా మొత్తం హ్యాక్ !

 

ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌ ఫొటో ఎడిటింగ్ యాప్ 'ఫేస్ యాప్’. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ యాప్‌ను వాడేస్తూ.. ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌ యాప్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ఏ వ్యక్తి ఫొటోనైనా సరే కృత్రిమ పద్ధతిలో వృద్ధుల ముఖంలా మారుస్తుంది. అయితే దీనితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

 సమస్యలు కూడా ఎక్కువ

సమస్యలు కూడా ఎక్కువ

ఈ యాప్ వాడడం వల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అదెలా అంటే ఫేస్‌యాప్ వాడే ప్రతి వ్యక్తి ఆ యాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పాలి. అయితే ఈ నిబంధనల్లోనే అసలు విషయం దాగి ఉంది. అదేంటంటే యూజర్లు యాప్‌లో స్టోర్ చేసే తమ సమాచారంతో పాటు ప్రొసెసింగ్ కోసం సర్వర్లలోకి అప్‌లోడ్ చేసే ఫొటోలు ఇతర డేటాను ఫేస్ యాప్ వాడుకోవచ్చు.

  ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు.

ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణకు ఇండియాలో యాప్ ఉపయోగించిన వ్యక్తుల ఫొటోలు, డేటాను ఈ యాప్ వేరే దేశాల్లో తమకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు. సమాచారాన్ని ఇతరులకు అమ్ముకోవచ్చు. మనం టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పినందు వల్ల ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పకుండా యాప్‌ను వాడుకోవడం కుదరదు.

 పౌరుల వ్యక్తిగత డేటాను
 

పౌరుల వ్యక్తిగత డేటాను

ఈ యాప్‌ని ఓపెన్ చేయగానే ఇంటర్నెట్‌లో తమ ఫొటోలు అన్నీ అప్‌లోడ్ అయ్యాయని చాలా మంది చెబుతున్నారు. ఫేస్‌యాప్ గురించి అమెరికా సెనేట్‌లో కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తమైంది. ఫేస్‌యాప్‌పై దర్యాప్తు చేయాలని సెనేట్‌లో మైనారిటీ నేత చక్ షుమర్ డిమాండ్ చేశారు. "ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. అమెరికా పౌరుల వ్యక్తిగత డేటాను విదేశీ శక్తులు స్వాధీనం చేసుకుంటున్నాయి" అని ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఒక లేఖలో ఆయన వెల్లడించారు. అయితే ఫేస్ యాప్ ఈ ఆరోపణలను ఫేస్‌యాప్ కొట్టిపారేసింది.

 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో

2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో

అయితే యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలించట్లేదని ఆ కంపెనీ చెబుతోంది. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ యాప్ ఉపయోగించొద్దని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తమ అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిందని చెబుతున్న సమయంలో షుమర్ దానిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ప్రైవసీ ఎంత ప్రమాదంలో పడింది అనేదానిపై అంత స్పష్టత లేదు, కానీ దీనిని ఉపయోగించకపోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని భద్రతాధికారి బాబ్ లార్డ్ అన్నారు.

 పాలసీ పూర్తిగా చదివితే

పాలసీ పూర్తిగా చదివితే

ఫేస్ యాప్ ప్రైవసీ పాలసీ పూర్తిగా చదివితే అసలు విషయాలు తెలుస్తాయి. మీ కంటెంట్‌ని షేర్ చేసేందుకు ఫేస్ యాప్‌కు యాక్సెస్ లభిస్తుంది. మీ పేరు, కుకీస్, లొకేషన్ డేటా, యూసేజ్ డేటా లాంటివాటిని వ్యాపారులకు షేర్ చేసే అవకాశముంది. ఫేస్ యాప్ సర్వర్లు లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్‌ను ఆటోమెటిక్‌గా రికార్డ్ చేసుకుంటాయి. మీ వెబ్ రిక్వెస్ట్, ఐపీ అడ్రస్, బ్రౌజర్ టైప్, రిఫర్ పేజీలు, యూఆర్ఎల్, డొమైన్ పేర్లు, ల్యాండింగ్ పేజీలు, చూసిన పేజీలు ఇలా... అనేక సమాచారం ఫేస్ యాప్‌కు తెలిసిపోతుంది. దీంతో యాప్ వాడటానికి సరదాగా ఉన్నా ప్రైవసీకి ముప్పు ఉందన్న భయాందోళనలు టెక్ నిపుణుల్లో కనిపిస్తున్నాయి.

ఫేస్‌యాప్ వివాదం

ఫేస్‌యాప్ వివాదం

ఫేస్‌యాప్‌ను 8 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. 2017లోకూడా ఫేస్‌యాప్ వివాదం మూటగట్టుకుంది. యూజర్లు జాతిని ఎడిట్ చేసే సదుపాయం అందులో పెట్టడంతో విమర్శలు వచ్చాయి.తమ ముఖారవిందం ఎలా ఉందో చూసుకుని మురిసిపోతున్నారు. అయితే, ఫేస్ యాప్ ను పోలిన నకిలీ యాప్ లు వస్తున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ కాస్పర్ స్కీ హెచ్చరిస్తోంది. నకిలీ యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటే వాటితోపాటే యాడ్ వేర్లు, మాల్వేర్లు కూడా మొబైల్ ఫోన్లో చొరబడతాయని కాస్పర్ స్కీ నిపుణులు చెబుతున్నారు. మొబిడ్యాష్ పేరుతో ఇప్పటికే ఓ యాడ్ వేర్ స్మార్ట్ ఫోన్లలో స్వైరవిహారం చేస్తోందని అన్నారు. దీని ప్రభావంతో ఫోన్ సొంతదారుకు, కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తులకు నష్టం తప్పదని అంటున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Old Isn't Always Gold: FaceApp and Its Privacy Policies

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X