2012 ఒలంపిక్‌ గేమ్స్‌లో ఆటగాళ్ల ద్వారా సందడి చేయనున్న ట్విట్టర్ పక్షి

Posted By: Staff

2012 ఒలంపిక్‌ గేమ్స్‌లో ఆటగాళ్ల ద్వారా సందడి చేయనున్న ట్విట్టర్ పక్షి

లండన్: 2012 ఒలంపిక్ గేమ్స్ లండన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటి వచ్చే సంవత్సరం జరగనున్నటువంటి ఒలంపిక్ గేమ్స్ ఎక్స్‌పీరియన్స్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకోవడానికి ఆటగాళ్లకు పరిమిషన్ ఇచ్చింది. ఐతే ఆటగాళ్లకు ఇచ్చినటువంటి ఆ సదవకాశాన్ని ఆటగాళ్లు సద్వినియోగ పరచుకోవాలని ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్దితులలోను తమయొక్క ట్వీట్స్‌ని కమర్షియల్‌గా ప్రోడక్ట్స్‌ని ఎత్తి చూపించేవిధంగా ట్వీట్ చేయకూడదని ఆదేశించింది.

ఆస్ట్రేలియా ఒలంపిక్ కమిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్‌ కధనం ప్రకారం ఒలంపిక్ గేమ్స్‌కు వచ్చినటువంటి అద్లెట్స్‌ని ఉత్సాహాపరచే విధంగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాని కూడా ఒలంపిక్ గేమ్స్‌లో ఓ పార్ట్ చేసేందుకు, వారియొక్క ఎక్స్ పీరియన్స్‌ను బ్లాగ్స్‌లలో, ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలని ఆటగాళ్లకు సూచించడం జరిగింది. ఆటగాళ్లు తమయొక్క ట్వీట్స్‌ని కేవలం ఆటగాళ్లుగా మాత్రమే ట్వీట్ చెయ్యాలని అన్నారు. జర్నలిస్ట్ మాదిరి ట్వీట్స్ చేస్తే సహించేది లేదని అన్నారు. ఇలా రూల్స్ ప్రత్యేకంగా పెట్టడానికి కారణం బీజింగ్ ఒలంపిక్స్‌లో జరిగినటువంటి పరిస్దితులను దృష్టిలో పెట్టుకోని ఇలా చేస్తున్నామన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting