పడవ నడుపుదాం రండి!

Posted By: Staff

పడవ నడుపుదాం రండి!

2012, లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా, గుగూల్ ‘స్లాలొమ్ కానో’ (ఇరు వైపులా కొనలు కలిగిన సన్నని పడవను అతి వేగంగా నడిపే క్రీడ)కు ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత ఇంటరాక్టివ్ డూడుల్‌ను హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. ఈ క్రీడలో పాల్గొనే అధ్లెట్లు తమ తమ పడువలతో నదిలో ఏర్పాటు చేసిన గేట్లను దాటుకూంటూ వేగంగా గమ్యస్థానానికి చేరుకోవల్సి ఉంటుంది. నెటిజనులకు ఈ క్రీడపట్ల మక్కువను మరింత పెంచే క్రమంలో గుగూల్ ఏర్పాటు చేసిన ‘ఇంటరాక్టివ్ స్లాలొమ్ కానో’ డుడూల్ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ గేమ్ ఆడాలనుకునే వారు సదురు డూడుల్ పై ‘ప్లే’ బటన్‌ను క్లిక్ చేసి, కీబోర్డ్ లోని బార్, కుడి-ఎడమ బాణం కీలను ఉపయోగిస్తూ 20 సెకన్ల వ్యవధిలో పడవును గమ్యస్థానికి చేర్చాల్సి ఉంటుంది.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot