తప్పుడు బెంచ్ మార్కింగ్ ఫలితాలతో జనాలను మోసం చేస్తున్న ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ!

ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేముందు ఆ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవటమనేది ప్రస్తుత ట్రెండ్‌కు ఓ ఆనవాయితీగా మారిపోయింది.

By GizBot Bureau
|

ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేముందు ఆ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవటమనేది ప్రస్తుత ట్రెండ్‌కు ఓ ఆనవాయితీగా మారిపోయింది. ఇంటర్నెట్‌లో కొలువు తీరి
ఉన్న పలు ప్రముఖ వెబ్‌సైట్‌లు ఫోన్ విడుదలకు ముందే ఆ డివైస్‌‌లోని కాంపోనెంట్స్ ఇంకా సాఫ్ట్‌వేర్స్‌ను నిశితంగా పరీక్షించి వాటికి సంబంధించిన పెర్ఫామెన్స్ రిజల్ట్స్‌ను బెంచ్‌మార్కింగ్ స్కోర్స్ రూపంలో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతోన్న తెలిసిందే. ఈ స్కోర్స్ ఆధారంగానే చాలా మంది యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకుంటున్నారు.

 

ట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగిందిట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగింది

పక్కా ప్రణాళికతో...

పక్కా ప్రణాళికతో...

తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ తన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన బెంచ్ మార్కింగ్ ఫలితాలను ఎక్కువుగా చూపిస్తూ జనాలను మోసం చూస్తున్నట్లు ఓ పరిశీలనలో వెలుగుచూసింది. ప్రముఖ టెక్నాలజీ న్యూస్ బ్లాగ్ ఆనంద్‌టెక్ (AnandTech) రివీల్ చేసిన వివరాల ప్రకారం Huawei తన P20 మోడల్‌కు సంబంధించిన పెర్ఫామెన్స్ రిజల్ట్స్‌ను 3డీ‌మార్క్ (3DMark ) అనే కంప్యూటర్ బెంచ్‌మార్కింగ్ టూల్‌లో ఎక్కువుగా చూపించేందుకుగాను ఒక ప్రత్యేకమన ప్రోగ్రామ్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తేలింది.

 

 

జాబితాలో మిగిలిన ఫోన్లు కూడా..

జాబితాలో మిగిలిన ఫోన్లు కూడా..

ఈ మోసాన్ని 3డీమార్క్ టూల్‌కు సంబంధించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పసిగట్టటంతో అసలు విషయం బయటపడింది. దీంతో 3డీమార్క్ తన ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్' క్యాటగిరీ లిస్ట్ నుంచి Huawei P20, P20 Pro, Nova 3 ఇంకా Honor Play స్మార్ట్‌ఫోన్‌లను తొలగించింది. వాస్తవానికి మార్కెట్లో విడుదలయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్ కూడా 3డీమార్క్ బెంచ్‌మార్క్ టెస్టును ఎదుర్కోవల్సి. ఈ పెర్ఫామెన్స్ టెస్ట్‌లో పాస్ అయిన స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో 3డీమార్క్ చేరుస్తుంది. ఈ కంప్యూటర్ బెంచ్‌మార్కింగ్ టూల్‌ను యూఎల్ బెంచ్‌మార్క్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది.

 

 

పెర్ఫామెన్స్ ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తూ నిర్ణయం..
 

పెర్ఫామెన్స్ ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తూ నిర్ణయం..

తాజాగా చోటుచేసుకున్న పరిణామల నేపథ్యంలో యూఎల్ బెంచ్‌మార్క్స్ స్పందిస్తూ.. హువావే డివైస్ లను మా ల్యాబ్ లో టెస్ట్ చేసిన తరువాత అవి మా రూల్స్ ను అతిక్రమించయాని తేలింది. దీంతె ఈ ఎఫెక్టడ్ మోడల్స్‌ను డీలిస్ట్ చేయటంతో పాటు పెర్ఫామెన్స్ ర్యాంకింగ్స్ నుంచి తొలగించామని తెలిపింది.

 

 

సమర్థించుకున్న హువావే..

సమర్థించుకున్న హువావే..

ఈ ఘటన పై ఆండ్రాయిడ్ అథారిటీ ఇష్యూ చేసిన స్టేట్‌మెంట్స్ పై హువావే స్పందిస్తూ ఏదైనా బెంచ్ మార్క్ంగ్ యాప్‌ను తమ ఫోన్‌లలో రన్ చేస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా స్పందించే విధంగా తమ ఫోన్‌లను డిజైన్ చేసినట్లు తెలిపింది. సాధారణ బెంచ్ మార్కింగ్ సందర్భాలలో బెంచ్‌మార్కింగ్ అప్లికేషన్‌ను హువావే గుర్తించిన వెంటనే ‘Performance Mode'ను అడాప్ట్ చేసుకుని ఆప్టిమల్ పెర్ఫామెన్స్‌ను పెంచేస్తుందని హువావే వివరణ ఇచ్చుకుంది.

 

 

కంపెనీ ప్రతిష్టకు దెబ్బే..

కంపెనీ ప్రతిష్టకు దెబ్బే..

చైనాలో నెలకున్న పోటీ వాతావరణం నేపథ్యంలో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు బెంచ్ మార్కింగ్ ఫలితాలను ఎక్కువుగా చూపించటమనేది రోటీన్ థింగ్‌గా మారిపోయిందని మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. ఏదేమైనప్పటికి యాపిల్ తరువాతి స్థానాన్ని సొంతం చేసుకున్ని హువావే ఈ విధమైన చర్యలకు పాల్పడటం కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేదిగా ఉంది.

 

 

Best Mobiles in India

English summary
OMG! Huawei And Honor Phones Caught Cheating Benchmark Tests.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X