అనిల్ అంబానీకి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ముఖేష్ అంబాని !

Written By:

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబాని తన తండ్రి పుట్టినరోజు నాడు తమ్ముడు అనిల్ అంబానికి ఊహించని బహుమతిని అందించారు. దాదాపు రూ. 23 వేల కోట్లను అనిల్ అంబాని అందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన ఆర్కమ్ ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లనీయకుండా మినేష్ అంబానీనే స్వయంగా కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ .23 వేల కోట్లు అందించినట్లు అనధికార వర్గాల సమాచారం..

ధీరూభాయి అంబానీ పుట్టినరోజు సందర్భంగా ముఖేశ్ అంబానీ ఆర్‌కామ్ అధినేత తమ్ముడు అనిల్ అంబానికి రూ .23 వేల కోట్లు అందించినట్లు అనధికార వర్గాల సమాచారం. ఇప్పటికే సుమారు రూ .45 వేల కోట్ల అప్పులతో సతమతమవుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు ఇది పెద్ద ఊరటగానే చెప్పాలి.

మొత్తం రుణభారాన్ని..

ఈ డీల్ ద్వారా ఆర్‌కామ్ తన మొత్తం రుణభారాన్ని రూ .6 వేల కోట్ల వరకు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒప్పందం కింద

ఈ ఒప్పందం కింద ఆర్‌కామ్‌కు చెందిన విలువైన వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్లు, ఫైబర్, మల్టీ ఛానల్ నెట్వర్క్ (ఎంసిఎన్ఎస్) ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జెఐఎల్) సొంతం చేసుకుంది. ఇప్పటికే 2 జీ, 3 జీ ఆపరేషన్స్ ఆపేసిన ఆర్‌కామ్ ఇప్పుడు 4 జీ సేవలకు స్వస్తి పలికినట్లు చేసింది.

ఆస్తులు ఇవే..

ఆర్‌కామ్‌కు చెందిన 122.4 మెగాహెడ్జ్ 4 జీ స్పెక్ట్రమ్, 43 వేల టవర్స్, ఇక జియో పరిధిలోకి రానున్నాయి. అలాగే 1.78 లక్షల కిలోమీటర్ల మేర టెలీకాం ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ కూడా జియో సొంతం చేసుకోబోతోంది.

2010లో ..

2010లో ఆర్‌కామ్‌ దేశంలోనే రెండో అది పెద్ద మొబైల్ ఆపరేటర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనిల్ అంబానిని పాతాళానికి నెట్టివేశాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
On father's birthday, Mukesh Ambani gives Anil Ambani Rs 23,000 crore relief More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot