రివీల్ అయిన వన్ ప్లస్ 7ప్రో దరలు:
OnePlus 7 ప్రో మే 14 న విడుదల చేయబడుతుందని ఈ వారంలో ధృవీకరించింది.
OnePlus 7 ప్రో మే 14 న విడుదల చేయబడుతుందని ఈ వారంలో ధృవీకరించింది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ వివరాలు ఆన్ లైన్ లో చాలా రకాలుగా కనిపించాయి.

OnePlus CEO పీట్ లావు OnePlus 7 ప్రో ధరను 5000 యువాన్ ($ 749)గా నిర్ధారించినట్లు అనేక రకాలైన వదంతులు వెల్లడయ్యాయి మరియు అవి విశ్వసనీయ వర్గాల నుండి వచ్చాయి.

మొబైల్ వేరియంట్
ఎమర్జింగ్ టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ యూరప్లో లభించే వివిద రకాల మొబైల్ వేరియంట్ ధరలను వెల్లడించారు.వన్ ప్లస్7 మూడు వేరియంట్లలో వస్తుంది 6GB RAM+128GB స్టోరేజ్,8GB RAM+256GBస్టోరేజ్,12GB RAM+256GBస్టోరేజ్. వీటిలో 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధరను మాత్రం రివీల్ చేయలేదు. మిగిలిన రెండు వేరియంట్స్ వివరాలు వరుసగా 8GB + 256GB వేరియంట్ దర € 749 / $ 749 మరియు 12GB + 256GB వేరియంట్ దర € 819 / $ 819గా నిర్ధారించినట్లు సమాచారం.

బెంగుళూర్ లో ఈవెంట్
ఇండియాలో ఈవెంట్ బెంగుళూర్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద హోస్ట్ చేయబడుతుంది. ఎంట్రీ పాస్లు కోసం రూ .999లు . ఎంట్రీ పాస్ల కోసం కంపెని ఆన్లైన్ పోర్టల్ లో ఏప్రిల్ 25 10am నుండి అందుబాటులో ఉంటాయి.
వ్యక్తిగతంగా వేగం అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మే 14 న బెంగుళూరులో చేరండి మరియు OnePlus 7-సిరీస్ యొక్క లాంచ్ ఈవెంట్ ను చూడండి. ఈ లాంచ్ ఈవెంట్లో అనేక ఆశ్చర్య ప్రకటనలు OnePlus 7 సిరీస్ ల మోడల్స్ని ప్రదర్శిస్తాము అని ఒక ప్రెస్ నోట్లో కంపెనీ పేర్కొంది.

వన్ ప్లస్7 మూడు వేరియంట్స్
6GB RAM+128GB వేరియంట్ ----------- unknown
8GB + 256GB వేరియంట్ ------------ దర € 749 / $ 749
12GB + 256GB వేరియంట్ ------------ దర € 819 / $ 819

OnePlus 7 సిరీస్ మూడు మోడల్స్ లొ రానుంది:
OnePlus 7, PnePlus 7 ప్రో మరియు OnePlus 7 ప్రో 5G అనే మూడు మోడల్స్ లలో మొబైల్స్ మార్క్కెట్ లోకి రానున్నాయి. OnePlus 7 ప్రో ఎడమ మరియు కుడి అంచుల వైపు వంగిన 6.7-inch సూపర్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 1440 x 3120 పిక్సల్స్ క్వాడ్ HD + రిజల్యూషన్ మద్దతు ఇస్తుంది. ఈ మొబైల్ 30W వార్ప్ ఛార్జ్ తొ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. OnePlus 7 ప్రో మిర్రర్ గ్రే, ఆల్మాండ్, మరియు నెబ్యులా బ్లూ రంగులలో వస్తాయి.


Click it and Unblock the Notifications








