షాకంటే ఇదే: ఇండియా నుంచి యుకెకు..అదీ ఆటో రిక్షాలో..

Written By:

దాదాపు 10 వేల కిలోమీటర్లు.ఒకే ఒక రిక్షా...దానికి ఎటువంటి ఇంధనం లేదు. అయితేనేమి ఖండాంతరాలు దాటింది. దాదాపు 10 దేశాలను చుట్టేసింది. ఇండియానుంచి బ్రిటన్ వరకు ఎటువంటి ఇంధనం లేకుండా కేవలం సోలార్ పవర్‌తోనే తన టుక్ టుక్ బండిలో ప్రయాణం సాగిస్తున్నారు. ఏందీ నమ్మలేకున్నారా..అయితే మీరు ఈ న్యూస్ చూడాల్సిందే.

Read more: షాక్ : డెడ్‌పూల్ సినిమా అసలు ఫైట్ సీన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నవీన్ అనే కుర్రాడు ఈ అద్భుతానికి వేదికగా

నవీన్ అనే కుర్రాడు ఈ అద్భుతానికి వేదికగా మారాడు. ఇతను ఈ ఆటోతో కొచ్చిలో తన ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడి నుంచి బెంగుళూరు ,ముంబైల మీదుగా దుబాయ్ చేరుకున్నారు. ఇప్పుడు బందార్ అబ్బాస్ నుండి ఇరానియన్ సిటీస్ టెహ్రాన్ దాటడానికి రెడీ అయ్యారు. ఇరానియన్ -టుర్కిష్ బార్డర్ మీదుగా ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

35 సంవత్సరాల ఈ యువ ఇంజనీర్

35 సంవత్సరాల ఈ యువ ఇంజనీర్ ఇండియాలోని రద్ధీ రోడ్లపై తన ప్రయాణాన్ని సులువగా కొనసాగించడానికి మార్గాన్ని అన్వేషిస్తుండగా ఈ ఆలోచన తట్టినట్లుగా తెలుస్తోంది.

అందరికీ సోలార్ పవర్ మీద అవగాహనా

అంతే కాకుండా ఈ ఆటోరిక్షా ద్వారా అందరికీ సోలార్ పవర్ మీద అవగాహనా కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. సోలార్ సాయంతో బండిని ఎలా నడపవచ్చు అనేదానిపూ స్కూళ్లలో ,కాలేజీల్లో క్లాసులు కూడా చెబుతున్నారు.

కాలుష్యం లేకుండా చేయడానికి తన వంతు ప్రయత్నంగా

ఇండియాలో ఉన్న అనేక వాహనాలు రోడ్లమీద చక్కర్లు కొడుతూ హానికారకమైన రసాయనాలను వెదజల్లుతున్నాయి. దీనిద్వారా తీవ్రమైన పొల్యూషన్ ఏర్పడి అందరూ నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ కాలుష్యం లేకుండా చేయడానికి తన వంతు ప్రయత్నంగా ఈ సోలార్ టుక్ టుక్ బండిని తయారుచేసానని దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఖల్జీ టైమ్స్ కు చెప్పాడు.

మహీంద్రాలో ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా దీని మీద

మూడు సంవత్సరాల క్రితం దీన్ని సెకండ్ హ్యాండ్ క్రింద కొనుగోలు చేసానని. అప్పడు మహీంద్రాలో ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా దీని మీద శ్రద్ధ పెట్టానని తెలిపారు. దీనికి అమర్చిన యంత్రాల విషయానికొస్తే ఓ కొత్త మోటార్, గేర్ బాక్స్, సోలార్ టుక్ టుక్, మూడు చక్రాలు వీటి సాయంతోనే బండిని తయారుచేశారు.

బండికి మొత్తం సోలార్ ప్యానల్స్

బండికి మొత్తం సోలార్ ప్యానల్స్ ఉంటాయి. వాటి రక్షణ కోపసం చుట్టూ క్లాత్ కూడా అమర్చి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ తో 100 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయగలదు. ఈ సోలార్ ప్యానల్స్ సూర్యుని నుండి దాదాపు 30 శాతం విద్యుత్ వినియోగాన్ని తీసుకుని మిగిలిన విద్యుత్ మొత్తాన్ని బ్యాటరీల్లో సేవ్ చేస్తుంది.

ఈ ట్రిప్ కి అయిన ఖర్చు 40,000 డాలర్లు

ఈ ట్రిప్ కి అయిన ఖర్చు 40,000 డాలర్లు, ఇందులో ట్రావెల్ ఖర్చులు అలాగే వెహికల్ ఖర్చులు పర్మిట్స్ , వీసా ఖర్చులు ఇంకా కొన్ని ఖర్చులు కలిసి ఉన్నాయి.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write From India to UK One Engineers 10000 Km Journey in a Self Designed Solar Autorickshaw
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot