ఏటీఏంలపై హ్యాకర్ల కన్ను, నిమిషాల వ్యవధిలో డబ్బు మాయం
గత కొద్ది సంవత్సరాలను నుంచి సైబర్ హ్యాక్లరు విరుచుకుపడుతున్నారు. అన్ని రంగాలను హ్యాకింగ్ చేస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి భారీన పడని రంగమంటూ ఏదీ లేదు.
గత కొద్ది సంవత్సరాలను నుంచి సైబర్ హ్యాక్లరు విరుచుకుపడుతున్నారు. అన్ని రంగాలను హ్యాకింగ్ చేస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి భారీన పడని రంగమంటూ ఏదీ లేదు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడి ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తెలుసుకుని అక్కడ పరికరాలను హ్యాక్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు వీరి కన్నే బ్యాంకింగ్ రంగపై పడిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే వారు ఏటీఎంలను హ్యాక్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని తమ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఫైనాన్సియల్ ఫ్రాడ్ గురించి మీరు 10 విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఏటీఎం ప్రాడ్ పై హెచ్చరికలు జారీ చేసిన యుఎస్ అథారిటీ
US-CERT, the Department of Homeland Security, FBIలు ఈ మధ్య ఈ విషయం మీద అలర్ట్ను జారీ చేశాయి. ఈ అలర్ట్ ప్రకారం Hidden Cobra అనే హ్యాకింగ్ గ్రూపు కోడ్ నేముతో ప్రపంచ వ్యాప్తంగా ఏటీఎంలను దోచుకుంటున్నాయి.

Lazarus:ఎటీఎంలే టార్గెట్
Symantec అనే సంస్థ ప్రకారం Lazarus అనే పేరు ద్వారా ఈ రకమైన హ్యాకింగులకు ఈ గ్రూపు పాల్పడుతోందని తెలుస్తోంది. కాగా యుఎస్ లో హ్యాకింగ్ కు ఈ గ్రూపు పెట్టుకున్న కోడ్ నేమ్ పేరు Hidden Cobra.దీని ద్వారా హెఎండ్ ప్రొపైల్ కంపెనీలపై వీరు విరుచుకుపడుతున్నారు. 2014లో సోని పిక్చర్ హ్యాకింగ్ notorious WannaCry ransomware ద్వారా 2016లో ఇండియాపై హ్యాకింగ్ దాడులకు ఈ గ్రూపుకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

FASTCash : ఏటీఎంల హ్యాకింగ్ గ్రూపు పేరు
ఏటీఎంలను హ్యాక్ చేయడానికి వీరు పెట్టుకున్న పేరు FASTCash.ఈ కోడ ద్వారా ఏటీఎంలను హ్యాక్ చేసి కోట్ల రూపాయలను స్వాహ చేస్తున్నారు.

30 దేశాల్లో కార్యకలాపాలు
వీరికి అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగించే ముఠాలు ఉన్నాయి. గతంలో Bangladesh Central Bank మీద దాడి చేసిన wannaCry ransomware కూడా దీనిలో భాగస్వామ్యమే. ఈ హ్యాకింగ్ లో 81 million డాలర్లను కొల్లగొట్టారు.

బ్యాంకు నెట్ వర్క్లే టార్గెట్
వీరు ప్రధాంగా బ్యాంకు నెట్ వర్క్ లను టార్గెట్ చేస్తూ ఈ రకమైన హ్యాకింగ్ లకు పాల్పడతారు. బ్యాకింగ్ హ్యాకింగ్ ల ద్వారా వీరు ఎటీంల సమాచారాన్ని తెలుసుకొని మొత్తాన్ని దోచుకునేందుకు పథఖ రచన చేస్తారు.

కొన్ని బ్యాంకుల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటారు.
సెక్యూరిటీ అంతగా లేని బ్యాంకుల నెట్ వర్క్ లనే వీరు ప్రధానంగా టార్గెట్ చేస్తారు. ఈ బ్యాంకుల్లో రన్ అయ్యే అప్లికేషన్ల మీద నిఘా వేసి ఈ రకమైన మోసాలకు పాల్పడతారు.

జీరో బ్యాలన్స్ అకౌంట్లే టార్గెట్
US-CERT report ప్రకారం వీరు ప్రధానంగా జీరో బ్యాలన్స్ అకౌంట్ల మీదనే తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు.

అటాకింగ్ ప్లేస్
Symantec రిపోర్టు ప్రకారం వీరు అకౌంట్లు ఓపెన్ చేయడం, అమౌంట్ విత్ డ్రా రిక్వెస్టులు, కార్డులు జారీ లాంటి వాటి ద్వారా హ్యాకింగ్ పనులకు పాల్పడుతున్నారు.

మాల్ వేర్
మాల్ వేర ను సర్వర్లలోకి ప్రవేశపెట్టి ఏటీఎంల ద్వారా భారీ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని తెలుస్తోంది.

డేంజరస్ టెక్ ఎక్స్ప్ర్ట్ లు
ఈ కీలక డీల్ లో బాగా అనుభవం కలిగిన టెక్ నిపుణులు పనిచేస్తున్నారు. ఈ గ్రూపులో అందరూ పేరు మోసి టెక్ నిపుణులేనని యుఎస్ అధికారులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications