ఇక ఒకే సిమ్‌తో 9 నెంబర్లు..?

|

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు!. ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఈ తరహా సాంకేతికత త్వరలో అందుబాటులోకి రాబోతోంది. కెనాడకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ టెక్నాలజీని సమకూర్చనుంది. భారత మార్కెట్లో ఈ ఏడాది చివరి నాటికి ఈ వర్చువల్ సిమ్ సొల్యూషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని బ్లాక్‌బెర్రీ భావిస్తోంది.

 
ఒకే సిమ్‌తో 9 నెంబర్లు..?

ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారుడు ఒకే సిమ్ కార్డ్‌తో తనకు సంబంధించిన అనేక రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోగలుగుతాడు. బిల్లింగ్ కూడా ప్రతి నెంబర్‌కు వేరువేరుగా వస్తుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏ వ్యక్తి ఒకటికి మించి మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు వాడనవసరం లేదు. బ్లాక్‌బెర్రీ అందిస్తోన్న ఈ టెక్నాలజీ ఎక్స్‌క్లూజివ్‌గా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల పైనే పని చేస్తుందా లేకుంటే ఇతర కంపెనీల మొబైల్ ఫోన్‌లలోనూ పని చేస్తుందా అనే అంశం పై స్పష్టత రావల్సి ఉంది.

 

(ఇంకా చదవండి: అమెజాన్ సమ్మర్ సేల్.. 10 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు)

Best Mobiles in India

English summary
One SIM, 9 Numbers? BlackBerry plans to roll out Virtual SIM Provisioning in India by year end.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X