Samsung గెలాక్సీ డివైస్ల కోసం వన్ UI 4.1.1 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌!! త్వరలో అందుబాటులోకి...

|

స్మార్ట్‌ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తున్న కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా నిరంతర OS అప్‌గ్రేడ్‌లను కోరుకుంటూ ఉంటార. ఆండ్రాయిడ్ మరియు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను తన యొక్క వినియోగదారుల కోసం షెడ్యూల్‌ పద్దతిలో డెలివరీ చేయడంలో దక్షిణ కొరియా బ్రాండ్ శామ్సంగ్ అందరి కంటే ముందు వరుసలో ఉంది. అందులో భాగంగానే ఈ కంపెనీ ఇప్పుడు కొత్తగా UI 4.1.1 అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2019 నుండి కంపెనీ విడుదల చేసిన వాటిలో ఎంపిక చేసిన పరికరాలకు నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందజేస్తున్నట్లు హామీ ఇచ్చింది. వీటి గురించి మరిన్నివివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

UI 4.1 సాఫ్ట్‌వేర్‌

శామ్సంగ్ కంపెనీ 2022 ప్రారంభంలో గెలాక్సీ S22 సిరీస్ కోసం వన్ UI 4.1 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి శామ్సంగ్ తన గెలాక్సీ హ్యాండ్‌సెట్‌లన్నింటికీ అప్‌డేట్‌ను అందించడం ప్రారంభించింది. One UI 4.1.1 ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చని కొన్ని పుకార్లు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iPadOS 16 కొత్త అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు!! మల్టీ టాస్కింగ్, స్లైడ్ ఓవర్ మరిన్నిiPadOS 16 కొత్త అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు!! మల్టీ టాస్కింగ్, స్లైడ్ ఓవర్ మరిన్ని

వన్ UI 4.1.1 మరొక కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ విడుదల?

వన్ UI 4.1.1 మరొక కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ విడుదల?

దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ కమ్యూనిటీ సైట్‌లోని గుడ్‌లాక్ మోడరేటర్ రాబోయే సాఫ్ట్‌వేర్ వెర్షన్ కు సంబందించిన వివరాలను వెల్లడించారు. వండర్‌ల్యాండ్ మాడ్యూల్‌తో సమస్య ఉన్న వినియోగదారుల నుండి విచారణకు మోడరేటర్ ప్రతిస్పందించారు. మోడరేటర్ దీనికి ప్రతిస్పందిస్తూ "కస్టమర్‌లు నివేదించిన ఎర్రర్‌కు ప్లాట్‌ఫారమ్ స్థాయి కోడ్ కరెక్షన్ చాలా అవసరం మరియు వన్ UI 4.1.1 వెర్షన్‌లో కరెక్ట్ చేయబడతాయి." వినియోగదారులు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌ వెర్షన్ 4.1.1 వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే అది వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరించవచ్చు అని ఆయన అన్నారు.

WWDC 2022: M2 ప్రాసెసర్‌లతో రెండు మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్WWDC 2022: M2 ప్రాసెసర్‌లతో రెండు మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్

One UI 4.1.1 అప్‌గ్రేడ్

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్‌ల కోసం కంపెనీ UI 3.1.1 అప్‌గ్రేడ్‌ను గత సంవత్సరం విడుదల చేసింది. తరువాత కాలంలో ఈ అప్‌గ్రేడ్‌ చివరికి శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్లెట్‌లకు కూడా విస్తరించింది. టిప్‌స్టర్ యొక్క నివేదిక ప్రకారం One UI 4.1.1 అప్‌గ్రేడ్ కంపెనీ యొక్క తదుపరి జెనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదల చేయబడుతుంది. అయితే ఇది ఈ సంవత్సరం ఆగస్టులో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. గెలాక్సీ Z ఫోల్డ్ 4 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 4 ఆగస్టు నెలలో శామ్‌సంగ్ కంపెనీ యొక్క అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌తో పాటుగా ఆవిష్కరించనున్నాయి. ఫోల్డబుల్ మరియు పెద్ద-స్క్రీన్ పరికరాల కోసం ఇప్పటికే One UI 4.1 సాఫ్ట్‌వేర్‌ అందుబటువులోకి వచ్చింది. అయితే One UI 4.1.1 మరొక కొత్త సాఫ్ట్‌వేర్‌తో మరికొన్ని కొత్త ఫీచర్‌లను పొందే అవకాశం ఎంతైనా ఉంది . గత ట్రాక్ రికార్డ్ ఆధారంగ వెర్షన్ 4.1.1 ఆండ్రాయిడ్ 12పై ఆధారపడి ఉంటుంది మరియు One UI 5.0 ఎక్కువగా ఆండ్రాయిడ్ 13పై ఆధారపడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
One UI 4.1.1 Upcoming Software Version Launching Very Soon For Samsung Galaxy Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X