‘వన్ ఇండియా’ వార్తా ప్రపంచం మీ మొబైల్‌లో!

Posted By: Prashanth

‘వన్ ఇండియా’ వార్తా ప్రపంచం మీ మొబైల్‌లో!

 

వివిధ రంగాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ విశేషాలను మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌లతో మీకందించే ప్రయత్నంగా భారతదేశపు నెం 1 భాషా పోర్టల్ ‘వన్ ఇండియా’ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. యూజర్లు ఉచితంగా ఈ అప్లికేషన్‌ను తమ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను యాక్సిస్ చేసుకోవటం ద్వారా పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, కామసూత్ర, హెల్త్ తదితర విభాగాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇంకా హిందీ వర్షన్‌లలో వీక్షించవచ్చ. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో శ్రోత రోజకు 500 కొత్త విశేషాల పట్ల శ్రోత అవగాహన ఏర్పరుచుకోవచ్చు.

అప్లికేషన్ కీలక ఫీచర్లు:

యూజర్ ఫ్రెండ్లీ డిజైన్: యూజర్లకు ఉత్తమ స్థాయి అనుభూతులను చేరువచేసే సంకల్పంతో ఈ అప్లికేషన్‌ను నిపుణుల బృందం పూర్తిస్థాయి ఏకాగ్రతతో వృద్ధి చేసింది. వినియోగదారు ఈ అప్లికేషన్‌ను సులువుగా ఆపరేట్ చేసుకుని సమాజం పట్ల తన జ్ఞానాన్ని మరింత పెంపొదించుకోవచ్చు.

మీ అభిరుచిలకు అనుగుణంగా: మీ అభిరుచికి అనుగుణంగా హోమ్ స్ర్కీన్ పై సెక్షన్ లను పర్సనలైజ్ చేసుకునే సౌలభ్యత.

శోధన ఇంకా షేరింగ్: ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ ‘కీవర్డ్’ సెర్చ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. కీవర్డ్‌ను టైప్ చేయటం ద్వారా సంబంధిత సమాచారం మీ ముందు ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీకు నచ్చిన శీర్షికను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకునే వెసలబాటు. అంతేకాదండోయో.. శీర్షిక పై అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించవచ్చు.

క్రికెట్ అప్‌డేట్స్ : బంతి-బంతికి సంబంధించిన స్కోర్ అప్‌డేట్‌తో పాటు క్రికెట్ ప్రంపచంలో చోటచేసుకుంటున్న తాజా పరిణామాలను సవివరంగా తెలుసుకోవచ్చు.

ఫోటోలు డౌన్‌లోడ్: మీకు ఇష్టమైన సెలబ్రెటీలకు సంబంధించి ఫోటో గ్యాలరీలను డౌన్‌లోడ్ చేసకునే సౌలభ్యత,

ఆఫ్‌లైన్‌లో కూడా: మీరు తాజాగా డౌన్‌లోడ్ చేసుకున్న వార్తను ఆఫ్‌లైన్‌లో సైతం చుదువుకోవచ్చు,

ఫాంట్ సైజ్: మీ సౌకర్యాన్ని బట్టి ఫాంట్ సైజును ఎంపిక చేసుకోవచ్చు,

వన్ ఇండియా అప్లికేషన్ డౌన్‌లోడింగ్ కోసం గుగూల్ ప్లే స్టోర్‌లకి లాగిన్ అవ్వండి

(గమనిక త్వరలో వన్ ఇండియా అప్లికేషన్ ఐఫోన్, ఐపాడ్‌లను సైతం సపోర్ట్ చేయనుంది)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot