వన్‌ప్లస్ 10R 5G: ఇండియాలో ఇటీవలి లాంచ్లో వన్‌ప్లస్ ఫోన్‌లు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాయి

|

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఈ నెల ప్రారంభంలో చైనాలో OnePlus Ace యొక్క రీబ్రాండెడ్ గా లాంచ్ అయిన వన్‌ప్లస్10R 5G స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో నిన్న రెండు ఎడిషన్లలో లాంచ్ అయింది. 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎండ్యూరెన్స్ ఎడిషన్ మరియు 80W SuperVOOC ఛార్జింగ్‌తో సరసమైన మోడల్ గా మరొకటి విడుదల అయ్యాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8100-Max SoC ద్వారా శక్తిని పొందుతూ హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్‌తో జత చేయబడి వస్తుంది. 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz డిస్‌ప్లే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న వన్‌ప్లస్ బ్రాండ్ కొత్త ఫోన్ రూ.40వేల ధరల విభాగంలో ఎందుకు ప్రత్యేకంగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 10R 5G ధరల వివరాలు

వన్‌ప్లస్ 10R 5G ధరల వివరాలు

భారతదేశంలో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్10R 5G ని రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 80W SuperVOOC ఛార్జింగ్‌ టెక్నాలజీతో వచ్చే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.38,999. కాగా 80W SuperVOOC ఛార్జింగ్ మోడల్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.42,999 ధర వద్ద ఫారెస్ట్ గ్రీన్ మరియు సియెర్రా బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. అలాగే 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో లభించే ఎండ్యూరెన్స్ ఎడిషన్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.43,999 ధర వద్ద సియెర్రా బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడల్స్ యొక్క మొదటి సేల్స్ మే 4, మధ్యాహ్నం 12pm నుండి అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ మరియు వన్‌ప్లస్ యాప్‌లో ప్రారంభమవుతుంది. వినియోగదారులు వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు మరియు క్రోమా నుండి కూడా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 10R 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 10R 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 10R 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఆక్సిజన్‌OS 12.1తో రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,412 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-Max SoC చేత శక్తిని పొందుతూ 12GB LPDDR5 ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 3D ప్యాసివ్ కూలింగ్ టెక్నాలజీతో జత చేయబడింది. ఇది ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి వీలుగా హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్ మరియు GPA ఫ్రేమ్ స్టెబిలైజర్ ని కలిగి ఉన్నాయి. ఇది సున్నితమైన గేమింగ్ పనితీరును అందిస్తుంది.

ఫోటోగ్రఫీ

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతిచ్చే f/1.88 లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ f/2.2 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ GC02M1 మాక్రో షూటర్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో EIS మద్దతుతో f/2.4 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ Samsung ISOCELL S5K3P9 సెన్సార్ కలిగి ఉంది.

కనెక్టివిటీ

వన్‌ప్లస్ 10R 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్‌లోని ఇతర సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. చివరిగా వన్‌ప్లస్ 10R 5G ఎండ్యూరెన్స్ ఎడిషన్ మోడల్ 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో లభిస్తుంది. మరొక మోడల్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus 10R 5G Launched in India With 150W SuperVOOC Fast Charging Technology: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X