OnePlus 10T 5G కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో బగ్ సమస్యలకు చెక్...

|

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ఇటీవల వన్‌ప్లస్ 10T ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది ప్రారంభించబడి కొన్ని రోజుల అయినప్పటికి దాని మొదటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకోవడం ప్రారంభించింది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 13ని తీసుకురాదు. అయితే ఇది ఫోన్‌లోని అనేక బగ్‌లకు పరిష్కారంను అందిస్తుంది. కొత్త OxygenOS కొత్త అప్‌డేట్ కెమెరా షూటింగ్ ఎఫెక్ట్‌ను పరిష్కరించడమే కాకుండా షూటింగ్ పరిస్థితుల కోసం కెమెరా యాప్ విచిత్రంగా కనిపించే సమస్యను తొలగిస్తుందని వన్‌ప్లస్ సంస్థ తెలిపింది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇప్పుడు భారతీయ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వన్‌ప్లస్ 10T ఫర్మ్‌వేర్ వెర్షన్ అప్‌డేట్

వన్‌ప్లస్ 10T ఫర్మ్‌వేర్ వెర్షన్ అప్‌డేట్

కమ్యూనిటీ ఫోరమ్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 10T ఫోన్ అందుకున్న మొదటి ఫర్మ్‌వేర్ వెర్షన్ అప్‌డేట్ తర్వాత ఇది CPH2413_11_A.05కి మారుతుందని తెలిపింది. కొత్త అప్‌డేట్ "సిస్టమ్ స్థిరత్వం మరియు పటిమను మెరుగుపరుస్తుంది", "స్టార్టింగ్ స్పీడ్ ని ఆప్టిమైజ్ చేస్తుంది", "నెట్‌వర్క్ స్థిరత్వాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది", "షూటింగ్ ప్రభావాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది మరియు "వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది" దీనితో పాటుగా "కెమెరా అసాధారణంగా ప్రదర్శించినప్పుడు నిర్దిష్ట దృశ్యాలలో కనిపించే సమస్యలను పరిష్కరిస్తుంది" అని నివేదికలు తెలుపుతున్నాయి.

OxygenOS అప్‌డేట్

OxygenOS అప్‌డేట్

వన్‌ప్లస్ సంస్థ అందించే కొత్త OxygenOS అప్‌డేట్ యొక్క పరిమాణాన్ని సంస్థ పేర్కొనలేదు కానీ అన్ని ఫోన్‌లు ఈ అప్‌డేట్ ని స్వీకరిస్తాయని ధృవీకరించింది. ఈ OTA అప్‌డేట్ ముందు ముందు కూడా ఉంటుంది అంటే ఇది దశలవారీగా విడుదల చేయబడుతుందని కంపెనీ తెలిపింది. కొంతమందికి మిగిలిన వారి కంటే ముందే అప్‌డేట్ అందుతుంది. "కొద్ది రోజుల్లో" విస్తృతమైన రోల్అవుట్ అనుసరించబడుతుంది.

వన్‌ప్లస్10T 5G స్పెసిఫికేష‌న్లు
 

వన్‌ప్లస్10T 5G స్పెసిఫికేష‌న్లు

వన్‌ప్లస్10T ఇండియాలో రూ.49,999 ధర వద్ద నుండి మూన్‌స్టోన్ బ్లాక్ మరియు జేడ్ గ్రీన్ వంటి కలర్ ఎంపికలలో ప్రారంభమవుతాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌తో లభిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB వంటి ర్యామ్ కెపాసిటీ ఆధారంగా మూడు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. దీనికి హైప‌ర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ప‌నిచేస్తుంది.

కెమెరా సెట‌ప్‌

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను త‌గ్గించి మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేప‌ర్ కూలింగ్ సిస్ట‌మ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,800 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.

Best Mobiles in India

English summary
OnePlus 10T 5G Brings OxygenOS New Software Update For Several Bug Fixes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X