Home
News

వన్‌ప్లస్ 10T 5G 16GB RAM వేరియంట్ సేల్స్ ఎప్పుడో తెలుసా?

వన్‌ప్లస్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో ఇటీవల లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 16GB RAM వేరియంట్ సేల్స్ భారతదేశంలో ఆగస్టు 16 నుండి మొదలుకానున్నాయి. ఈ వన్‌ప్లస్ 10T 5G ఫోన్ గత వారం భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ మరియు 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ మోడల్‌ల అమ్మకాలు ఆగస్ట్ 6న మొదలయ్యాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC, 4,800mAh బ్యాటరీతో 150W సూపర్VOOC వైర్డ్‌చార్జింగ్, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 10T 5G 16GB RAM వేరియంట్ ధరల వివరాలు

వన్‌ప్లస్ 10T 5G 16GB RAM వేరియంట్ ధరల వివరాలు

భారతదేశంలో వన్‌ప్లస్ 10T 5G ఫోన్ యొక్క 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ. 55,999. ఇది మూన్‌స్టోన్ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 16GB RAM మోడల్ ఆగస్టు 16 మధ్యాహ్నం 12pm నుండి అమెజాన్ మరియు OnePlus అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ సేల్ ఆఫర్‌గా SBI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీలను ఉపయోగించి రూ.5000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తోంది. అదనంగా రూ.2000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ విక్రయ ఆఫర్‌లలో రూ.2,799 విలువైన 12-నెలల స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ ను రూ.499 తో పొందవచ్చు. ఇది ఆగస్టు 31 వరకు మాత్రమే ఉంటుంది.

వన్‌ప్లస్10T 5G స్పెసిఫికేష‌న్లు

వన్‌ప్లస్10T 5G స్పెసిఫికేష‌న్లు

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా మూడు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. దీనికి హైప‌ర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ప‌నిచేస్తుంది.

కెమెరా సెట‌ప్‌

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను త‌గ్గించి మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేప‌ర్ కూలింగ్ సిస్ట‌మ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.

బ్యాట‌రీ

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,800 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 10T 5G Smartphone 16GB RAM Variant Sale Start in India on August 16: Price, Specifications, Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X