Home
News

వన్ ప్లస్ 11 5G సేల్ ఈ రోజే! ఎక్కడ కొనాలి, ధర & ఆఫర్ల వివరాలు!

By Maheswara

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు (ఫిబ్రవరి 14) భారతదేశంలో సేల్ మొదలుకాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వారం క్రితమే ఫిబ్రవరి 7న భారతదేశంలో లాంచ్ చేయబడింది. వన్ ప్లస్ 11 5G వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2తో పాటు లాంచ్ చేయబడింది. ఇది ముందు మోడళ్ళ కంటే కొన్ని అప్గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు కాన్ఫిగరేషన్‌లను మరియు అనేక రంగుల ఆప్షన్లను అందిస్తుంది. ఇది క్వాల్కమ్ నుండి సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని కలిగి ఉన్న ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13 తో వస్తుంది.ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

OnePlus 11 5G Smartphone With 50MP Camera To Go On Sale In India Today. Price And Specifications Details In Telugu.

భారతదేశంలో వన్ ప్లస్ 11 5G ధర, సేల్ ఆఫర్‌ల వివరాలు

వన్ ప్లస్ 11 5G నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్ భారతదేశంలో ఫిబ్రవరి 14 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 56,999, అయితే 16GB RAM + 256G స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 61,999 గా ఉంటుంది. వన్ ప్లస్ 11 5G ఫోన్ ఎటర్నల్ గ్రీన్ మరియు టైటాన్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఆఫర్ ధరపై కొనుగోలు చేయడానికి, కొనుగోలుదారులు వివిధ బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMIలు లేదా నెట్‌బ్యాంకింగ్‌పై రూ.1,000 ఆఫర్ ఉంది.

OnePlus 11 5G Smartphone With 50MP Camera To Go On Sale In India Today. Price And Specifications Details In Telugu.

ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వామ్య షాప్ లలో కూడా కొనుగోలు చేయవచ్చు. వన్ ప్లస్ 11 5G కొనుగోలుపై వినియోగదారులు 6 నెలల వరకు 100GB గూగుల్ వన్ సభ్యత్వాన్ని కూడా పొందుతారు. వన్ ప్లస్ 11 5G కొనుగోలుతో ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ 6 నెలల Spotify ప్రీమియం మెంబెర్ షిప్ ను కూడా ఉచితంగా అందిస్తుంది.

వన్ ప్లస్ 11 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు

ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో, ఆండ్రాయిడ్ 13 ఆక్సిజన్ OS తో వస్తుంది. ఇది 6.7-అంగుళాల క్వాడ్-HD+ (1,440x3,216 పిక్సెల్‌లు) 10-బిట్ LTPO 3.0 అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ డిస్ప్లే 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కూడా పొందుతుంది. ఇది క్వాల్కమ్ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పనిచేస్తుంది. గరిష్టంగా 16GB వరకు LPDDR5X ర్యామ్ తో ఇది పనిచేస్తుంది.

OnePlus 11 5G Smartphone With 50MP Camera To Go On Sale In India Today. Price And Specifications Details In Telugu.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్ల గురించి ఆలోచిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో డ్యూయల్ సెల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంటే, వన్ ప్లస్ 11 5G ఫోన్ 25 నిమిషాల ఛార్జింగ్ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేయబడవచ్చు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తో పాటు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు పరిశీలిస్తే, వన్ ప్లస్ 11 5G ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను తీసుకువస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక 1/2.74-అంగుళాల సోనీ IMX709 సెన్సార్‌తో టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల కోసం, ఇది16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లు పరిశీలిస్తే, ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.3, GPS (డ్యూయల్ బ్యాండ్, L1+L5), A-GPS, NFC మరియు USB 2.0 టైప్-సి పోర్ట్‌కు మద్దతును అందిస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus 11 5G Smartphone With 50MP Camera To Go On Sale In India Today. Price And Specifications Details In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X