త్వరలోనే ... OnePlus 11 సిరీస్ ఫోన్లు కూడా ! లీక్ అయిన వివరాలు.

By Maheswara
|

OnePlus అభిమానులు ఈ సంవత్సరం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడం పూర్తయిందని మీరు అనుకుంటే, మీరు తప్పుగా ఆలోచించినట్లే.ఎందుకంటే, OnePlus కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త OnePlus 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. మీరు OnePlus ఫోన్ల లాంచ్ లను గమనించినట్లయితే, కంపెనీ ఇటీవల OnePlus 10T పరికరాన్ని విడుదల చేసింది.

 

OnePlus 11 సిరీస్‌

ఇటీవల విడుదల చేసిన OnePlus 10T స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం చివరి ప్రీమియం మోడల్ అవుతుందని మేము కూడా భావించాము, కానీ కంపెనీ మా అంచనాను మార్చింది. అవును, OnePlus దాని తదుపరి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్, OnePlus 11 సిరీస్‌ ను లాంచ్ చేయడానికి  బిజీగా ఉంది మరియు కంపెనీ నుండి నివేదికలు ఇప్పటికే వెలువడడం ప్రారంభించాయి.

OnePlus 11 సిరీస్ మోడల్‌లు

OnePlus 11 సిరీస్ మోడల్‌లు

చైనీస్ టిప్‌స్టర్ ప్రచురించిన సమాచారం ప్రకారం, OnePlus 11 సిరీస్ మోడల్‌లు ఈ సంవత్సరం చివరి నాటికి, అంటే డిసెంబర్ 2022లో లాంచ్ చేయబడతాయి. ఈ కొత్త OnePlus 11 స్మార్ట్‌ఫోన్ నుండి ఆశించిన ముఖ్యాంశాలలో ఒకటి, స్మార్ట్‌ఫోన్ శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుందని అంచనావేయబడింది.

OnePlus 11 సిరీస్ లైనప్‌లో
 

OnePlus 11 సిరీస్ లైనప్‌లో

OnePlus 11 సిరీస్ లైనప్‌లో OnePlus 11 మరియు OnePlus 11 ప్రో అనే రెండు ఫోన్‌లను కంపెనీ విడుదల చేయనుంది. చైనా-ఆధారిత టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా వచ్చిన లీక్ ప్రకారం OnePlus 11 కొత్త Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని సూచించింది. ముఖ్యంగా, ఇది Qualcomm 8+ Gen 1 చిప్‌సెట్ కంటే మెరుగైన పనితీరు ఇస్తుంది.అలాగే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ పై అధిక అంచనాలను సృష్టించింది.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

ఇది కాకుండా, ఈ కొత్త వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు ,ధర వివరాలు మరియు కెమెరా వివరాలు వంటి ఇతర ఫీచర్ల గురించి ఇంకా ఎలాంటి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే, ఈ కొత్త OnePlus 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ డిసెంబర్ చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త వన్‌ప్లస్ అభిమానులను సంతోషం లో ముంచెత్తింది.

OnePlus 10T ప్రో లాంచ్

OnePlus 10T ప్రో లాంచ్

ఇటీవలే లాంచ్ అయిన OnePlus యొక్క తాజా స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రకారం,  OnePlus 10T ప్రో, ఇప్పుడు Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. OnePlus 10T ఇప్పుడు మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. OnePlus 10T స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 49,999. అలాగే, ఈ పరికరం యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 54,999 ఉంది.

ఈ మోడల్‌లు

ఈ మోడల్‌లు

అదేవిధంగా, ఈ పరికరం యొక్క హై-వేరియంట్ 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 55,999. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌లు మూన్‌స్టోన్ బ్లాక్ మరియు జేడ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్‌లు ఇప్పుడు Amazon సైట్ మరియు OnePlus అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ఈ ఫోన్ హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్‌ను కూడా ప్యాక్ చేస్తుంది, ఇది ఎక్కువ గంటల గేమింగ్ సమయంలో కూడా స్మార్ట్‌ఫోన్ పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్‌తో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 11 Series Smartphones Expected To Launch In India By The End Of The Year 2022. Expected Features Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X