Home
News

16GB ర్యామ్‌, 50MP కెమెరా OnePlus స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 తగ్గింపు.. ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో ఇటీవల కొత్త స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 12R 5G విడుదల అయింది. అయితే తాజాగా వన్‌ప్లస్‌ గత సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ 11R 5G స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 11R 5G) ధరను తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. రెండింటిపైనా తగ్గింపు ధరను ప్రకటన చేసింది.

వన్‌ప్లస్‌ 11R 5G స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్‌ 11R 5G స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Smartphone Price Cut) 6.74 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2772*1240 పిక్సల్‌ రిజల్యూషన్‌, మరియు 40Hz- 120Hz వరకు డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 1450 గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 1440Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌ విజువల్‌ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

Oneplus 11r 5G smartphone price slashed

వన్‌ప్లస్‌ 11R 5G వేరియంట్లు : ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 4nm ఆక్టాకోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌ అడెన్నో 730 GPU తో జతచేయబడింది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OxygenOS 13 పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

50MP ట్రిపుల్‌ కెమెరా సహా.. : కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 120 డిగ్రీ ఫీల్డ్‌ వ్యూతో 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 16MP కెమెరాను అమర్చారు.

Oneplus 11r 5G smartphone price slashed

ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ల కూడా తగ్గింపు ధరను పొందాయి. విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.39,999 గా ఉంది. ఈ ఫోన్‌ రూ.2000 తగ్గింపును పొందింది. ఫలితంగా రూ.37,999కే సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా 16GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.44,999 గా ఉండేది. ఈ వేరియంట్‌ ధర రూ.3000ను తగ్గించారు. ఫలితంగా రూ.41999 కే కొనుగోలు చేయవచ్చు.

రూ.1000 అదనపు తగ్గింపు : దీంతోపాటు ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్‌ 11R 5G ను గలాస్టిక్‌ సిల్వర్, సోనిక్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఈ వన్‌ప్లస్‌ 11R స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oneplus 11r 5G smartphone receives price cut on both variants in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X