OnePlus నుంచి కొత్త ఫోన్.. 18GB ర్యామ్, 512GB స్టోరేజీ..!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా వన్‌ప్లస్ శుభవార్త చెప్పింది. OnePlus 11R సోలార్ రెడ్ వేరియంట్‌ను అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 18GB ర్యామ్ సహా స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు లెదర్ ప్యానల్‌ను కలిగి ఉంది. మిడ్‌రేంజ్ కస్టమర్లను ఆకట్టుకొనే విధంగా ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 11R సోలార్ రెడ్ కలర్ ఫోన్ అక్టోబర్ 7న తేదీన కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 11R 5G హార్డ్‌వేర్‌లో మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. 18GB ర్యామ్ సహా 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని వన్‌ప్లస్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లోను లభిస్తుందని తెలిపింది.

వన్‌ప్లస్ 11R సోలార్ రెడ్ వేరియంట్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మంచి గ్రిప్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 18GB LPDDR5X ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది.
వన్‌ప్లస్ కొత్త వేరియంట్ కటింగ్ ఎడ్జ్ ర్యామ్ విటా టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఒకేసారి 50 యాప్‌లను ఓపెన్ చేసిన సున్నితమైన పనితీరును కనబరుస్తుందని తెలిపింది. 16GB వెర్షన్‌లో 44 యాప్‌ల పరిమితి మాత్రమే ఉంది. ఈ అదనపు ర్యామ్ 6 శాతం వేగంగా యాప్‌లను ఓపెన్ చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పింది.

వన్‌ప్లస్ 11R సోలార్ రెడ్ వేరియంట్ 100W సూపర్‌వాక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను కేవలం 25 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని వన్‌ప్లస్ వెల్లడించింది. ఈ ఫోన్ ధర బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.37,999గా ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ 8 తేదీన ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, ట్యాబ్లెట్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. SBI కార్డులపై కొనుగోలు చేసిన వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది.
మరో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమై 15 తేదీన ముగుస్తుంది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్టు ఐసీఐసీఐ, యాక్సెస్, కోటక్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డులతో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్‌ను రూ.1500లకు పరిమితం చేసినట్లు చెప్పింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








